శనివారం, 10 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Vishwambhara: విశ్వంభర టీజర్‌పై ట్రోలింగ్.. లోపాలేంటి?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 13 అక్టోబర్ 2024

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara). దసరా (Dasara) పర్వదినం సందర్భంగా ఇవాళ టీజర్ ను (Vishwambhara Teaser) చిత్ర బృందం విడుదల చేసింది. ప్రతిష్టాత్మక చిత్రంగా వీఎఫ్ఎక్స్ (VFX)తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఎంతగానో ఎదురు (Fans waiting) చూస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్
విశ్వంభర మూవీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. బాస్ మరో హిట్ కొట్టేస్తున్నాడంటూ సంతోషపడుతున్నారు. అయితే, మెగా ఫ్యాన్స్ తప్ప మిగతా వారు మాత్రం మూవీ వీఎఫ్ఎక్స్ లో లోపాల గురించి ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో (Social Media) ట్రోలింగ్ కు (Trolling) దిగుతున్నారు.

గ్రాఫిక్ షాట్స్ పై అసంతృప్తి
విశ్వంభర మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రచారం జరిగినట్లుగా ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రం అని టీజర్ చూసిన వారికి అర్థం అవుతోంది. తదనుగుణంగానే టీజర్‌లో గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ను చొప్పించారు. మెగా ఫ్యాన్స్‌కి చిరు గ్రేస్‌తో పాటు అన్నీ బాగా నచ్చాయి కూడా. అయితే, మిగతా వారు కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ లోటుపాట్లను తెలియజేస్తున్నారు. గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు.

అంతరిక్షం సీన్ ఎత్తుకొచ్చారా?
టీజర్‌ ప్రారంభంలో కనిపించిన అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా ‘అవెంజర్స్’ నుంచి తీసుకొచ్చి పెట్టారంటూ ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు. వాటిపై ఆధారాలను సైతం ట్వీట్స్ లో జతపరుస్తున్నారు. ఇక గ్రాఫిక్స్ నేచురల్‌గా లేవంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. మూవీ రిలీజ్ సమయానికి ఇవన్నీ కాస్త సరిదిద్దుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. మెగా స్టార్ నటనను ఏమీ అనకపోయినప్పటికీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ మరింత శ్రద్ధ పెట్టాలంటున్నారు. ఇతడిని ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో పోలుస్తూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు.

రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
విశ్వంభర మూవీలో చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా చేస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కూడా పోటీలో ఉంది. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి, వచ్చే వేసవిలో విశ్వంభర రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ (Raja Saab) రిలీజ్ ఉంది. ఈ నేపథ్యంలో దాని తర్వాత అంటే మే నెలలో మండు వేసవిలో విశ్వంభరను విడుదల చేసే అవకాశాలున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో కూడా త్వరలోనే స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.

విశ్వంభర గ్రాఫిక్స్ గురించి వచ్చిన ట్రోల్స్ ఇవీ..

https://twitter.com/movie_monsterz/status/1844978011566674220

https://twitter.com/NTRHolicc_/status/1844986510548009031

చంద్రబాబుతో చిరంజీవి భేటీ
ఏపీ సీఎం చంద్రబాబును మెగా స్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరఫున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళాన్ని చిరంజీవి అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిరంజీవిని అభినందించి, ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి: Konda Surekha: కొండా సురేఖపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైర్ ఎవరెవరు ఖండించారంటే..
Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ’మెగా‘ ‘పవర్?’
CBN Cabinet: కొలువుదీరిన చంద్రబాబు కేబినెట్.. మంత్రులు వీరే
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్
Lord Shiva: మహాశివుడి 19 అవతారాలు తెలుసా? వాటి ప్రాముఖ్యం తప్పక తెలుసుకోండి!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading