శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ’మెగా‘ ‘పవర్?’

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 13 జూన్ 2024

Andhra Pradesh BJP: ఏపీలో బీజేపీ (AP BJP) పాగా వేసేందుకు లైక్ క్లియర్ అయ్యిందా? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకునేందుకు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? ఉత్తర భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారేందుకు బీజేపీకి పట్టు దొరికిందా? ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా వెళ్తున్న బీజేపీ.. ఏపీలోనూ (Andhra Pradesh) అదే తరహా రాజకీయాన్ని సాకారం చేసుకునే దిశగా వెళ్తోందా? ప్రాంతీయ పార్టీల సాయం తీసుకుంటూనే సొంతంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు తీవ్రం చేసిందా?

ఏపీలో జనసేన, (Janasena) తెలుగుదేశం (TDP) పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే.. ఇప్పుడు పవన్ ను మరింత దగ్గర చేసుకుంటోందా? అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో పవన్ ను ఉద్దేశించి ’’ఇక్కడ ఉన్నది పవన్ కాదు.. తుఫాన్‘‘ అని మోదీ వ్యాఖ్యానించారా? తాజాగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ల చేతులు పట్టుకుని పైకెత్తి మోదీ అభివాదం చేయడం దేనికి సంకేతం? ఆ వెంటనే మోదీ, పవన్, చిరంజీవి (Chiranjeevi) వద్దకు చంద్రబాబు వచ్చేయడం అక్కడున్న వారినే కాదు.. ఏపీ ప్రజలను సైతం ఆలోచింపజేస్తోంది. అంతే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరిని (Purandeswari) మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం, కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ప్యూర్ బీజేపీ లీడర్ అయిన వర్మకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడం.. ఇలా అనేక ఉదంతాలు బీజేపీ వైఖరిని చెప్పకనే చెబుతున్నాయి.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా పవన్ కల్యాణ్.. (Pawan Kalyan) తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని పలకరించాల్సిందిగా మోదీని కోరారు. వెంటనే మోదీ (Modi) పవన్ చేయి పట్టుకుని మరీ చిరంజీవి వద్దకు వెళ్లారు. చిరుతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతేనా.. పవన్ గడ్డం పట్టుకుని మరీ చిరు మురిసిపోతుండగా, మోదీ ఇద్దరినీ అభినందించారు. ఈ సన్నివేశం జనసైనికులు, మెగా అభిమానులను కట్టిపడేసింది. ఇక ఇదే సందర్భంగా మెగాస్టార్, పవర్ స్టార్ లను చేయి పైకెత్తి ముగ్గురూ అభివాదం చేశారు. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు.. వెంటనే వారి ముగ్గురి వద్దకు వచ్చారు. ప్రధాని చెవిలో ఏదో చెప్పబోయారు. అనంతరం మోదీ అక్కడున్న వారిని పలకరిస్తూ ముందుకు కదిలారు.

చిన్నమ్మపై నమ్మకం లేదా?
మోగాస్టార్, పవర్ స్టార్ ను అభినందించి వెనుదిరిగి వెళ్తున్న మోదీ.. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంను సైతం పలకరించారు. కానీ అతని పక్కనే ఉన్న పురందేశ్వరిని మోదీ పలకరించకపోవడం గమనార్హం. బీజేపీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న చిన్నమ్మపై మోదీ చిన్నచూపు చూస్తున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంలోనూ చిన్నమ్మకు మొండిచేయి ఎదురైంది. ఆ స్థానంలో అనూహ్యంగా వర్మకు చాన్స్ దక్కింది. మామూలుగా అయితే బీజేపీ తరఫున సీనియర్ నాయకులు ఎందరో ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ, చంద్రబాబు మార్క్ ఉన్న నేతలను మోదీ పూర్తిగా పక్కన పెట్టారని పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. చిన్నమ్మ పార్టీని బలోపేతేం చేస్తుందన్న నమ్మకం లేకనే మెగా పవర్ ల వైపు మోదీ మొగ్గు చూపుతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశంలో ప్రాంతీయ పార్టీల సాయం తీసుకుంటూనే అనేక రాష్ట్రాల్లో వాటి స్థానంలోకి వెళ్తోంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ఇదే ఫార్ములా అనుసరిస్తోందని తెలుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా గణనీయంగా పుంజుకుంది బీజేపీ. వచ్చే టర్మ్ కల్లా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదనే పరిస్థితి ఏర్పడింది. ఇక ఏపీలోనూ ఇప్పుడు బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీల బలం చేకూరింది. అయితే, సొంతంగా పోటీ చేస్తే సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పవన్ ను చేరదీశారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ ఎదిగిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ మార్గాలు సుగమం చేసుకుంటోంది.

ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడంతో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా మారారు. అయితే, గతంలో మద్దతు విషయంలో యూటర్న్ లు తీసుకున్న వీరిద్దరినీ నమ్మడానికి వీల్లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇతరులను కలుపుకోవడం, బలం పెరిగేలా చేసుకోవడంపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఏపీలో బీజేపీ పుంజుకోవడానికి మెగాస్టార్, పవర్ స్టార్ ను దగ్గర చేసుకోవడానికి పార్టీ ముఖ్య నేతలు పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చిరంజీవిని, పవన్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించడం గమనించవచ్చు. వీరిద్దరూ భవిష్యత్తులో రాజకీయంగా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో.. వీరిద్దరినీ చేరదీస్తే ఏపీలో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వారిపై మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి: CBN Cabinet: కొలువుదీరిన చంద్రబాబు కేబినెట్.. మంత్రులు వీరే
Rupee: కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ.. 83.57 వద్ద..
Chandrababu Food: చంద్రబాబు బతకడానికి ఏం తింటారో తెలుసా? ఫుడ్ డైట్ ఇదీ..
Lok Sabha Elections: 140 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓట్లు ఎక్కువ లెక్కించారా?

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading