HomeCinemaKonda Surekha: కొండా సురేఖపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైర్ ఎవరెవరు ఖండించారంటే..

Konda Surekha: కొండా సురేఖపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైర్ ఎవరెవరు ఖండించారంటే..

Konda Surekha: మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున, సమంత, నాగచైతన్య పేర్లను ప్రస్తావించడం తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. కొండా సురేఖ కామెంట్లపై (Konda Surekha Comments) సినీ తారలు భగ్గుమన్నారు.

ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ సినీ ప్రముఖులు ఎక్స్‌ వేదికగా పోస్ట్ లు పెట్టారు. హీరో వెంకటేశ్‌, చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, విశ్వక్సేన్ తదితరులు తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.

కించపరిచే వ్యాఖ్యలు దారుణం
‘‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’’
– అల్లు అర్జున్‌

సినిమా వాళ్లను టార్గెట్‌ చేయడం సిగ్గుచేటు
‘‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్‌, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులోభాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలని కోరుతున్నా. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’’
– చిరంజీవి

Read also: Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ హాట్ కామెంట్స్..
Nagarjuna Akkineni: కొండా సురేఖపై అక్కినేని నాగార్జున ఆగ్రహం
MRP : ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా? ఇలా చేయండి
Sharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం
Ravindranath Reddy: రాయలసీమపై చంద్రబాబుకు తొలి నుంచి కక్ష సాధింపే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు