Address Change in Aadhar: ఆధార్‌లో చిరునామా మార్పు ఇక మరింత సులువు

Address Change in Aadhar: మనదేశంలో (Bharat) ఆధార్ కార్డు చాలా కాలంగా అన్నింటికీ కీలకంగా మరారింది. సిమ్ కార్డు తీసుకోవడం మొదలు.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు (PAN Card) లాంటివి పొందాలన్నా.. ఉద్యోగాలు, వ్యాపారాలు.. ఇలా ఏవి చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. మనకున్న చాలా డాక్యుమెంట్లకు కూడా ఆధార్ కార్డుతో లింకేజీ అయ్యి ఉంటాయి. (Address Change in Aadhar)

ఐడీ ప్రూఫ్‌లుగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు లాంటివి ఉన్నప్పటికీ ఆధార్ కార్డు ఉంటేనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆధార్ కార్డులో మన ఇంటి పేరుతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా వివరాలుంటాయి. అయితే, చిరునామా మార్పు కోసం గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం దీన్ని సరళతరం చేస్తూ ఉడై నిర్ణయం తీసుకుంది.

త్వరలో ఓటర్ కార్డుకు కూడా అందరూ మ్యాండేట్‌గా ఆధార్ అనుసంధానం చేయనుంది కేంద్ర ఎన్నికల కమిషన్‌. ఇంతటి ముఖ్యమైన ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు పెద్ద తలనొప్పిగా అనిపించే అంశం. అయితే, దీనిపై తాజాగా ఉడై వెలువరించిన నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తోంది.

18 ఏళ్లు పైబడిన ఎవరైనా..

చిరునామా మార్పు కోసం ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలకు అదనంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ఉడై వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా చిరునామా మార్పు కోసం కుటుంబ పెద్దగా వ్యవహరించే అవకాశం ఉందని ఉడై స్పష్టం చేసింది.

వినియోగదారులు ఆధార్‌ కార్డులో చిరునామా మార్పు చేసుకొనేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తాజాగా వెసులుబాటు కల్పించింది. ఆధార్‌లో భార్య, పిల్లల చిరునామా లాంటివి మార్చాలంటే ఇప్పటి వరకు వారి పేరుపై ఉండే గుర్తింపు కార్డును ప్రూఫ్‌గా చూపించాల్సి వచ్చేది. అలా కాకుండా కుటుంబ పెద్ద సెల్ఫ్‌డిక్లరేషన్‌ పత్రంతో పిల్లలు, జీవితభాగస్వామి చిరునామాను మార్చుకొనే కొత్త విధానాన్ని ఉడై ప్రకటించింది.

Read Also : Post Office: పోస్టాఫీసులో గొప్ప పథకం.. డబుల్ బెనిఫిట్ మీ సొంతం!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles