ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Amaravati: నాడు వద్దన్న బారికేడ్లు.. ఇప్పుడు ఎందుకొస్తున్నాయి? 

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 22 అక్టోబర్ 2024

Amaravati: తన కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని, బారికేడ్లు, పరదాలు, దుకాణాల మూత లాంటి వాటికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో భద్రతా అధికారులకు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల పేరుతో ఇలాంటి చర్యలు (Amaravati) వద్దని ఆయన వారించారు. తన కాన్వాయ్ వెళ్లే దారుల్లో ప్రజలను ఎక్కువ సమయం ఆపొద్దంటూ ఆయన తన ముఖ్య భద్రతాధికారికి సూచించారు. భద్రత పేరుతో ప్రజలను వేధించవద్దని ఆయన చెప్పడం మంచి నిర్ణయమని అందరూ అనుకున్నారు.

అయితే, తాజాగా కరకట్ట మీద బారికేడ్లు ఏర్పాటు చేస్తుండటం చర్చనీయాంశమైంది. అమరావతిలో ఆయన నివాసం ఉంటున్న ఉండవల్లికి వెళ్లే దారుల్లో శాశ్వత బారికేడ్ల ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను అక్టోబర్ 21 సోమవారం తెల్లవారుజాము నుంచే చేపట్టారు. ఉదయాన్నే పొలాలకు వెళ్లే రైతులు వాటిని చూసి అవాక్కయ్యారు.

అరగంట వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న రైతులు.. బారికేడ్లు ఏర్పాటు చేస్తే ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. తెల్లవారుజామున పంట పొలాలకు వెళ్తుంటే ముందస్తు సమాచారం లేకుండా బారికేడ్లతో రాకపోకలు నిలిపేస్తారా? అంటూ నిలదీశారు. సీఎం భద్రత పేరుతో ఇలా తరచూ దారులు మూసేస్తే మేము ఎలా వెళ్లాలని మండిపడుతున్నారు. నాటి సీఎం జగన్‌పై పరదాలు కట్టుకున్నారంటూ అధికారంలోకి రాక ముందు టీడీపీ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భద్రత, ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్న భద్రత తీరుపై పెద్ద ప్రచారాన్నే టీడీపీ నిర్వహించింది. జగన్ పై పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంలో చంద్రబాబు, లోకేష్ లు, సంబంధిత మీడియా చాలా చురుగ్గా పాల్గొన్నాయి. జగన్ ఇంటి ఫెన్సింగ్ కు రూ.12 కోట్లు ఖర్చు చేశారంటూ భారీ ఎత్తున పబ్లిసిటీ చేశారు. ఇప్పుడు కరకట్ట మీద ఏర్పాటు చేస్తున్న భద్రతపరమైన రక్షణ పనులు.. మళ్లీ ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి.

వీఐపీల భద్రత ఎలా ఉంటుంది?
సాధారణంగా తమకు కల్పించే భద్రత, రక్షణ విషయంలో ముఖ్యమంత్రుల ప్రమేయం ఉండదు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లు సహా కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భద్రత ఏర్పాట్లు చేస్తారు. నివాసం ఉంటున్న ప్రాంతం, వీఐపీకి ఉన్న ముప్పు, భౌతిక, సామాజిక పరిస్థితులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల కార్యకలాపాలు, వారి ఉనికి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీఐపీలపై దాడికి అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే వీఐపీల రక్షణ చర్యలు ఉంటాయి. జగన్ నివాసం చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ అందులో భాగమేనని గత ప్రభుత్వంలో పని చేసిన సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు.

స్పైపర్ పాట్స్ సహా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించేలా ఇది డిజైన్ చేశామని, ఇది రక్షణగా ఉంటున్న సిబ్బందిపై కూడా ఒత్తిడిని తగ్గించిందని వారు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట, నదిలో కూడా ప్రత్యేకంగా కాపలా వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటి అంశాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని వారి భావన.

ఇవీ చదవండి: Badvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Chandrababu at Rayalaseema: ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వాలని సంకల్పించా.. ప్రాజెక్టుల టూర్‌లో చంద్రబాబు కామెంట్స్‌
Chandrababu Naidu: ప్రతి ఇంటి నుంచి అమెరికా వెళ్లారంటే అది మావల్లే: చంద్రబాబు
CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading