Dindori Blast News: రాత్రి భోజనం ముగించుకుని కుటుంబంతో కలిసి ఇంటి ఆవరణలో కూర్చున్న రాజేంద్ర బరోటియా వద్దకు అదే గ్రామానికి చెందిన రామ్భగత్ బరోటియా వచ్చాడు. మాటల మధ్య రసగుల్లా అంటూ ఓ వస్తువు ఇచ్చాడని పోలీసులు తెలిపారు. రాజేంద్ర దాన్ని స్వీట్గా భావించి నోట్లో పెట్టుకోగా పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన ఆయన జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని డిండౌరీ జిల్లా పడరియా ఛాంటా గ్రామంలో నవంబర్ 10న ఈ ఘటన జరిగింది.
ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటుండగా ఘటన
కొత్వాలీ పోలీస్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ నాగ్పురె వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి రాజేంద్ర ఇంటి ఆవరణలో చలిమంట వద్ద కూర్చున్నారు. రాత్రి 8 గంటల సమయంలో అక్కడికి వచ్చిన రామ్భగత్ ఆయన పక్కనే కూర్చుని మాట్లాడాడు. ఈ క్రమంలోనే రసగుల్లా అంటూ రాజేంద్రకు ఆ వస్తువును ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దాన్ని తినబోతుండగా నోట్లో పేలుడు జరిగి రాజేంద్ర దవడకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆటోలో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
పేలుడు తర్వాత కుటుంబ సభ్యులు రాజేంద్రను ఆటోలో డిండౌరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరుసటి రోజు పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఆ సమయంలో జిల్లా ఆసుపత్రి మార్చురీ వద్ద కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా ఉన్నారు. Amar Ujala Hindi News Live
రామ్భగత్ అరెస్టు.. ఘటన వెనుక ఉద్దేశంపై విచారణ
ఈ కేసులో రామ్భగత్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105తో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్రకు రామ్భగత్ ఆ వస్తువును ఎందుకు ఇచ్చాడన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవీ చదవండి: Diwali Crackers Prices: టపాసులకే బడ్జెట్ పేలుతోంది.. దీపావళి ఖర్చులతో మధ్యతరగతి ఉక్కిరిబిక్కిరి!
Diwali Horoscope 2026: దీపావళి తర్వాత ఈ నాలుగు రాశులకు జాగ్రత్త సూచనలు.. ఖర్చులు, నిర్ణయాలపై దృష్టి!






