Chandrababu at Rayalaseema: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టుల టూర్‌లో ఉన్నారు. ఇవాళ నంద్యాల జిల్లా నందికొట్కూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ముందు చూపుతోనే ప్రాజెక్టులను తెలుగుదేశం చేపట్టిందన్నారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కోసం చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనీవా అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. (Chandrababu at Rayalaseema)
రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. రాయలసీమలో తాము రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. జగన్ ఖర్చు పెట్టింది రూ.2 వేల కోట్లేనన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి ప్రకటించాలని వచ్చానన్నారు. రూ.10 లక్షల కోట్లు అప్పుతెచ్చి.. రాయలసీమకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదన్నారు.
తెలుగుగంగ, మచ్చుమర్రి ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందన్నారు. ఎస్ఆర్ బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులనూ తామే ప్రారంభించామన్నారు. నాలుగున్నరేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. రోడ్డుకు మట్టి వేయలేరుగానీ.. 3 రాజధానులు కడతారట? అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి.. 3 రాజధానులంటున్నారన్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. పరదాల మాటున కాదు.. ధైర్యం ఉంటే ప్రజల్లోకి రావాలంటూ వ్యాఖ్యానించారు.
నందికొట్కూరుకు వచ్చి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో నియోజకవర్గానికి ఒక సైకో తయారవుతున్నారన్నారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. బటన్ నొక్కుతున్నా అని జగన్ పదేపదే చెబుతున్నారని, బటన్ నొక్కడం కాదు.. బటన్ బుక్కుడు ఎక్కువైందంటూ చంద్రబాబు ఆరోపించారు.
Read Also : Chandrababu Projects tour: రేపటి నుంచి చంద్రబాబు ప్రాజెక్టుల టూర్.. సీమలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో?