Raja Saab: డార్లింగ్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం రాజా సాబ్ (Raja Saab). స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినీప్రియులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ (ఎస్‌కెఎన్) ఈ చిత్రం అప్ డేట్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజా సాబ్ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుగుతోందన్నారు.
అక్టోబర్ 23న రాజా సాబ్ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ మొదలు పెడతామన్నారు. ఆ తర్వాత వరుసగా ఇస్తూనే ఉంటామన్నారు. దీనికోసం డైరెక్టర్ మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. త్వరలోనే ‘రాజాసాబ్’ అప్‌డేట్స్ గురించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
అక్టోబర్ 23 నుంచి విడుదల వరకు ‘రాజాసాబ్’ (Raja Saab) వరల్డ్ లోకి ప్రేక్షకులను తీసుకెళ్తామన్నారు. మీడియా వాళ్లకు కూడా ఆ ప్రపంచాన్ని సరికొత్తగా చూపిస్తామన్నారు. డైరెక్టర్ మారుతి ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా షూటింగ్ పనులు కష్టపడి చేస్తున్నారన్నారు. వినాయకచవితి, దసరా.. ఇలా ఏ పండగకు కూడా ఆయన సెలవు తీసుకోకుండా శ్రమ పడుతున్నారని ఎస్కేఎన్ చెప్పారు. అనుకున్న సమయంలో మూవీని రిలీజ్ చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాజా సాబ్ మూవీ సంగతి చూస్తే.. మారుతి – ప్రభాస్ కాంబోలో రానున్న తొలి చిత్రం ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీ నిర్మాణం చేస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్ (Salaar), కల్కి 2898 ఏడీ (Kalki2898D) వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హరర్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త అవతారం చూస్తారని చిత్ర బృందం చెబుతోంది.
ఇవీ చదవండి: Prabhas: మీకు తెలుసా..? ప్రభాస్‌ను ఓ హీరోయిన్ అన్నా అని పిలిచింది..!
Vettaiyan: వేట్టయన్ కు తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేకపోయామంటే..
Kanguva: 8 భాషల్లో కంగువా రిలీజ్.. ఏఐతో డబ్బింగ్!
Ram charan Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రామ్ చరణ్..?
