యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. ప్రభాస్ (Prabhas) పెళ్లి గురించి చాలా కాలంగా అనేక రకాల పుకార్లు వచ్చినా అవి నిజం కాదని ఎప్పటికప్పుడు డార్లింగ్ (Prabhas) చెబుతూ వస్తున్నాడు. బాహుబలి చిత్రం తర్వాత స్వీటీ అనుష్కను పెళ్లాడబోతున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ, తర్వాత తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని వారు అనేక వేదికలపై చెబుతూ వచ్చారు.
హీరోయిన్లతో పాటు ఎందరో యువతుల మనసు దోచుకున్న ప్రభాస్ కు.. లేటెస్ట్ గా ఓ యంగ్ హీరోయిన్ షాక్ ఇచ్చింది. ఏకంగా అన్నా అని పిలిచేసింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అన్నా అని పిలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా. ఆమె ఇటీవల లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రంలో నటించింది. హీరోగా సంతోష్ శోభన్ నటించాడు. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది.
హీరో నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రభాస్ ను అన్నా అని సంబోధించింది. తాను నటించిన జాతి రత్నాలు సినిమా ట్రైలర్ ను కూడా ప్రభాస్ అన్న విడుదల చేశారని, అందుకే హిట్ అయ్యిందని తెలిపింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను కూడా ప్రభాస్ అన్నే విడుదల చేశాడని చెప్పింది. ఇది కూడా హిట్ అవుతుందని చెప్పింది. ఇక ప్రభాస్ ను అన్నా అని పిలవడంపై డార్లింగ్ ఫ్యాన్స్ సుర్రుమన్నారు. ఏకంగా అన్నా అని పిలవడం ఏంటని వాపోతున్నారు. ఇలా అయితే ప్రతి హీరోయిన్ ఈమెను ఆదర్శంగా తీసుకొని అన్నా అని పిలిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలే ప్రభాస్ పెళ్లి గురించి తామంతా ఖంగారు పడుతుంటే ఇప్పుడు హీరోయిన్ అన్నా అని పిలవడం ఏం బాగోలేదని చెబుతున్నారు.
ఆ సినిమా వల్లే రాశి కెరీర్ నాశనమైందా?
వెటరన్ హీరోయిన్ రాశి గురించి టాలీవుడ్ లో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు రాశి సినిమాలంటే యువతలో మంచి క్రేజ్ ఉండేది. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా రాణించిన రాశి.. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం ఆమెకు ప్లస్ అయ్యింది. ఇండస్ట్రీలో హీరోయిన్ అయ్యాక తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా ముద్ర వేసింది.
ఆమె నటించిన చిత్రాలు తెలుగుతో పాటు తమిళంలోనూ హిట్ అయ్యాయి. సుమారు దశాబ్దం పాటు హీరోయిన్ గా రాణించింది. రాశి అంద చందాలకు కుర్రాలు మతులు పోగొట్టుకొనే వారు. థియేటర్లలో ఆమె దర్శనమివ్వగానే ఈలలు కేకలతో హోరెత్తించేవారు. నేటికీ రాశి ఫ్యాన్స్ అనేక మంది ఉన్నారనడంలో సందేహం లేదు. వడ్డే నవీన్, శ్రీకాంత్, జగపతి బాబు, పవన్ కల్యాణ్ ఇలా అనేక మంది హీరోల సరసన నటించారు రాశి.
రాశి సినీ కెరీర్ ను ఓ సినిమా దారుణంగా దెబ్బతీసిందని చెబుతారు. రాశి కెరీర్ దెబ్బతినడానికి కారణం మహేష్ బాబు సినిమా నిజం అని టాక్. ఆ సినిమా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చింది. ఆ సమయంలో గోపీచంద్ విలన్ క్యారెక్టర్ చేశాడు. ఈ నేపథ్యంలో గోపీచంద్ కీప్ గా నటించేందుకు తొలుత రాశిని సంప్రదించారట. అయితే, హీరోయిన్ గా చేస్తున్న తనకు అలాంటి క్యారెక్టర్ సూట్ కాదని ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఇలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడ్డారట రాశి. అయినా సరే.. రాశిని బలవంతంగా ఒప్పించారట డైరెక్టర్ తేజ. మంచి పేరొస్తుందని మాయమాటలు చెప్పి చివరకు ఒప్పుకోక తప్పేలా లేదన్నట్లు పరిస్థితి క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఈ దెబ్బతో రాశికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయట. తర్వాత వాస్తవంగానే సినిమాల్లో ఆమె కనిపించలేదు.
Read Also : NTR 30: అభిమానులకు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ 30 నుంచి అదిరిపోయే అప్‌డేట్..