Kanguva: సూర్య (Suriya) హీరోగా నటిస్తున్న సినిమా ‘కంగువా’ (Kanguva). శివ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. స్టూడియో గ్రీన్ (Studio Green), యూవీ క్రియేషన్స్ (UV Creations) సంయుక్త నిర్మాణంలో వచ్చే నెల నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ (KE Gnanavel) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఎక్స్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన ‘కంగువా’లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని యూజ్ చేసినట్లు తెలిపారు.
కంగువా చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాత తాజాగా కొత్త విషయాన్ని వెల్లడించారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పారని, మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే మొదటి సారి అని తెలిపారు.
ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో (vettaiyan) అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐని వాడారని, ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్ కోసం తాము ఏఐని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇది విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ లాంగ్వేజ్ లతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో సైతం రిలీజ్ అవుతోంది. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత జ్ఞానవేల్ వెల్లడించారు.
వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే టార్గెట్ తో ఉన్నామని నిర్మాత మొన్నీమధ్యనే చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు రెడీగా ఉన్నాయని కూడా వెల్లడించారు. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా యోచిస్తున్నారు. ఈ మూవీ సూర్యని మరో స్థాయికి తీసుకు వెళ్తుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.
యాక్షన్‌తోపాటు భావోద్వేగాలకు ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. త్రీడీలోనూ ఈ సినిమా అలరించనుంది. చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందట. కంగ అనే ఓ పరాక్రముడి కథతో మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో తన నటనాచాతుర్యాన్ని కనబర్చారట. దిశా పఠానీ హీరోయిన్ గా చేస్తోంది. బాబీ డియోల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి: Vishwambhara: విశ్వంభర టీజర్‌పై ట్రోలింగ్.. లోపాలేంటి?
Vettaiyan: వేట్టయన్ కు తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేకపోయామంటే..
Upcoming Telugu Movies: ఈ దసరాకు సినిమాల జాతర.. ఏయే సినిమాలొస్తున్నాయంటే..
Sayaji Shinde: షాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ.. పోటీ లేదా?
Crime News: రూ.10 వేలు ఆశ చూపించి.. రూ.2.29 కోట్లు కొల్లగొట్టేశారు!
