శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Ram charan Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రామ్ చరణ్..?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 9 అక్టోబర్ 2024

Ram charan Neel: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీని చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ లిస్టులో మరో కీలక ప్రాజెక్టు చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. రామ్ చరణ్ తో కాంబోలో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగతాయట. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యం వహిస్తారని సమాచారం.

ఇక ప్రశాంత్‌ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. దీని తర్వాత సలార్‌ 2, కేజీఎఫ్‌ 3 చిత్రాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాటి తర్వాతే రామ్‌ చరణ్‌ తో చిత్రం మొదలయ్యే చాన్స్ ఉంది. ఈలోపు బుచ్చిబాబు, సుకుమార్‌ల డైరెక్షన్ లో చిత్రాలు పూర్తి చేసేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు.

మరోవైపు రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’తో (Game Changer) అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సినిమాని శంకర్‌ తెరకెక్కించారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మాణం చేశారు. కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. అంజలి, శ్రీకాంత్, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నా తేదీ ఖరారుపై ఇంకా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు తేదీలు పరిశీలిస్తున్నారట. నిర్మాణ అనంతర పనులు పూర్తయ్యే దాన్ని బట్టి డిసెంబర్ 20 లేదా క్రిస్మస్‌ కానుకగా 25న రిలీజ్ చేస్తారట.

తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ఓ ట్వీట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్‌ పనులు ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్నాయన్నాడు. దసరాకి దాన్ని విడుదల చేయడం లేదని, దీపావళి సందర్భంగా ఈనెల 30న ఓ సాంగ్ రిలీజ్ చేస్తామన్నాడు. ఈ మూవీ సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ ఫైనల్‌ ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయన్నాడు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా కావడంతో చరణ్ నటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also: Ram Charan: చరణ్ వాడే వస్తువుల ఖరీదు అన్ని కోట్లా?
Vetrimaaran: ఎన్టీఆర్‌కు వెట్రిమారన్ కథ వినిపించారా? 
Salaar Teaser: సలార్‌ టీజర్‌ రిలీజ్‌.. ఊరమాస్‌ ఎలివేషన్స్‌.. బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ ఖాయం!
Salaar: తెల్లవారుజామున 5.12 గంటలకే ఎందుకు? కేజీయఫ్‌2తో లింక్‌? ‘సలార్‌’పై ఆసక్తికర చర్చ
Prabhas: మీకు తెలుసా..? ప్రభాస్‌ను ఓ హీరోయిన్‌ అన్నా అని పిలిచింది..!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading