Pushpa 2 Update: అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన చిత్రం పుష్ప 2. ఈ మూవీ డిసెంబర్ లో రావడానికి సిద్ధం అవుతోంది. బాక్సాఫీస్ వద్ద తుపాన్ ని చూసేందుకు రెడీ కావాలంటూ పుష్ప 2 చిత్ర యూనిట్ తాజాగా పిలుపునిచ్చింది.
ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ను తీసుకొచ్చింది. భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతామంటూ పుష్పరాజ్‌పై మరిన్ని అంచనాలు పెంచేలా అప్ డేట్ ఇచ్చింది. ‘పుష్ప2’ ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ పూర్తి చేసుకుని లోడింగ్ అయ్యిందని పేర్కొంది.
అంచనాల్ని మించి ఈ మూవీ ఉండబోతోందని మరింత ఆసక్తి రేపేలా చేసింది. పుష్ప 2 సినిమా డిసెంబరు 6న విడుదల పక్కా అని పునరుద్ఘాటిస్తూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలన్నీ చిత్ర యూనిట్ చెప్పింది. ‘పుష్ప’ మూవీకి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప2’.
అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. మరోవైపు నిర్మాణ అనంతర పనులను కూడా కంప్లీట్ చేసుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి అదిరిపోయే సంగీతారన్ని ఇచ్చారు.
Read also: Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ ఎప్పుడంటే
Pushpa 2 Update: పుష్ప 2 మూవీ లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ వాయిదా వేసేదే లే!
National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడు రిషభ్
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ ఎప్పుడంటే
Ram Charan: చరణ్ వాడే వస్తువుల ఖరీదు అన్ని కోట్లా?
Samantha: రామ్ చరణ్‌పై సమంత హాట్ కామెంట్స్..
