HomeCinemaPushpa 2 Update: పుష్ప 2 మూవీ లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ వాయిదా వేసేదే...

Pushpa 2 Update: పుష్ప 2 మూవీ లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ వాయిదా వేసేదే లే!

Pushpa 2 Update: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇప్పటికే వాయిదాలు పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఐకాన్ స్టార్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పుష్ప 2 చిత్రం సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న తరుణంలో ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ పెండింగ్‌లో ఉండిపోవడంతో డిసెంబర్ కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాదాపు మరో నెల రోజుల పాటు షూటింగ్‌ పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లిపోయాడన్న వార్తలుకూడా ఇటీవల హల్ చల్ చేశాయి.

ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ కు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. మేకర్స్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్ట్లు ఎక్స్ వేదికగా మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తామంటూ రిలీజ్ తేదీ కూడా మార్చేదే లేదని స్పష్టత ఇచ్చారు. ఇటీవల పుష్ప-2 మరోసారి వాయిదా పడుతుందన్న గాసిప్స్ నేపథ్యంలో అభిమానులకు ఈ క్లారిటీ ఇవ్వాల్సివచ్చింది.

పుష్ప అప్ డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ కబురు రిలాక్స్ అయ్యేలా చేసింది. ఈగల్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పుష్ప పార్ట్‌-1 సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ కూడా మరో కీ రోల్ లో నటిస్తున్నారు.

ఇవీ చదవండి: Mass Jathara: ఆగస్టు 15న మాస్‌ జాతర.. పుష్ప 2తో సరికొత్త రికార్డులు ఖాయమా?
Pushpa2TheRuleTeaser: పుష్ప2.. ఆల్‌ సెట్‌! రేపే ట్రైలర్‌ విడుదల!
Kiss benefits: ముద్దుతో ఎన్ని ప్రయోజనాలో.. అనుబంధం అల్లుకుపోవాల్సిందే!
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Sperm: నిద్రలో వీర్యం పోతోందని బెంగ పడుతున్నారా? ఇది మీకోసమే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు