HomeCinemaAlia Bhatt: శారీరకంగా ఎంతో శ్రమపడ్డ ఆలియా భట్!

Alia Bhatt: శారీరకంగా ఎంతో శ్రమపడ్డ ఆలియా భట్!

Alia Bhatt: అలియా భట్, (Alia Bhatt) వేదాంగ్‌ రైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం జిగ్రా (Jigra). వాసన్‌ బాలా తెరకెక్కించారు. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్‌ 18 స్టూడియోస్, ఎటర్నల్‌ షైన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మాణం చేశాయి. రాహుల్‌ రవీంద్రన్‌ ఇందులో అబ్బురపరిచే పాత్రలో నటించారు. ఈ సినిమాని ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ నెల 11న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందార్భంగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) మాట్లాడుతూ.. కొన్ని సినిమాల ట్రైలర్లు, పబ్లిసిటీ ఫొటోస్ చూస్తుంటే అవి మనల్ని ‘రా.. చూడు’ అని పిలుస్తున్నట్లు ఉంటుందన్నాడు. హిట్టు కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, ఈ ‘జిగ్రా’ సినిమా ట్రైలర్‌ చూశాక కూడా తనకు అదే అనిపించిందన్నాడు. కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందని త్రివిక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం కోసం అలియా శారీరకంగా ఎంతో శ్రమపడ్డారని, ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుందన్నారు. ఆ కష్టం రేపు తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అనుభూతి వస్తుందన్నారు. అలియా ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో సీతగా తెలుగు ఇళ్లలోకి వచ్చేసిందన్నారు. ఈసారి విజయదశమికి మన ఇంటి ఆడపడుచుకు ‘జిగ్రా’తో కీలక విజయాన్ని అందుకోవాలన్నారు. దర్శకుడు త్రివిక్రమ్, నటి సమంత (Samantha) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు.

మా హీరోయిన్లు అందరికీ ఓ బాధ్యత ఉందని, సినిమాలు చూసే అమ్మాయిలకు ‘మీ కథలో మీరే హీరోయిన్స్‌’ అని గుర్తు చేసే బాధ్యత తమపై ఉందని సమంత అన్నారు. దాన్ని మరోసారి గుర్తు చేయడానికే అలియా ఈ ‘జిగ్రా’ చేసిందని వివరించారు. ఇది పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు.

హీరోయిన్ ఆలియా భట్ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌’ ద్వారా తనకు తెలుగు భాషతో ఒక ప్రత్యేకమైన అనుబంధం వచ్చిందన్నారు. తన కుమార్తె రాహా ఇంట్లో రోజూ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌ చేస్తుంటుందని తెలిపారు. తనకు ఆ పాటంటే చాలా ఇష్టమన్నారు. మంచి సినిమాల్ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల్ని మించిన వారు లేరని ఈ సందర్భంగా కితాబిచ్చారు.

Read also: Samantha: రామ్ చరణ్‌పై సమంత హాట్ కామెంట్స్..
Konda Surekha: కొండా సురేఖపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైర్ ఎవరెవరు ఖండించారంటే..
Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ హాట్ కామెంట్స్..
Nagarjuna Akkineni: కొండా సురేఖపై అక్కినేని నాగార్జున ఆగ్రహం
Anchor Syamala: వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. ట్రోలింగ్ శ్యామల ఫైర్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు