Ram Charan: రామ్ చరణ్ వాడే బ్రాండెడ్ బట్టలు, వస్తువల గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. రామ్ చరణ్ వేసుకొనే డ్రెస్, షూస్ లాంటి వాటి గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. అవి ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇక రామ్ చరణ్ వాడే వాచ్, షూస్ అభిమానులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆత్రుత పడుతుంటారు.వాటి ధర తెలిస్తే అభిమానుల కళ్లు తిరగాల్సిందేనంటున్నారు. (Ram Charan)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. ఇతర హీరోలకంటే భిన్నంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో హీరోలు ఈ తరహా స్టైలిష్ మెయింటైన్ చేసే వారు. ప్రస్తుతం రామ్ చరణ్ కాస్త స్టైలిష్ లుక్‌ను పెంచారు. ఈ లుక్స్ కాస్తా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా పరిమితి పెరిగిపోవడంతో రామ్ చరణ్‌ను పలువురు అభిమానులు కూడా అనుకరిస్తున్నారు.
చరణ్ వాడుతున్న వాచ్ కంపెనీ పేరు రిచర్డ్ మిల్లే. దీని ధర సుమారు 3 కోట్ల 34 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఆయన వాడే నైక్ కంపెనీ షూస్ రేటు అక్షరాలా 3 లక్షల 60 వేలు ఉంటుందట. ఈ రేటు చూసి అభిమానులు వామ్మో అంటూ షాక్ తింటున్నారు. చరణ్ వాడే నార్మల్ శాండల్స్ గుచీ చెప్పుల ధరే 50 వేల పైన ఉంటుందని తెలుసుకుంటున్న అభిమానులు.. కళ్లు తేలేస్తున్నారు.
బ్రాండెడ్ చరణ్..
మరోవైపు రామ్ చరణ్ లావిషింగ్ హౌస్, లగ్జరీ కార్స్, హార్సెస్, పెట్స్, గాగుల్స్ నుంచి వాచెస్ వరకు అన్నీ బ్రాండెడ్ అండ్ కాస్ట్‌లీనే అని చెబుతున్నారు. రామ్ చరణ్ గురించిన వార్త ఏది తెలిసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా వాచ్ అండ్ షూస్ గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చరణ్ RC15 మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదలవుతోంది. ఇక ఉపాసన, రామ్ చరణ్ దంపతులు ఇటీవలే తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: KLIN KAARA: క్లీంకార.. రామ్ చరణ్, ఉపాసన తనయ పేరు ఇదే.. అర్థం తెలుసా?