Cricket: క్రికెట్ దేవుడిగా మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటను (Cricket) మరోసారి చూడాలనుకుంటున్నారా? అయితే టీమిండియా కెప్టెన్ గా మరోసారి సచిన్ ఆడి మనకు వీనుల విందు చేయనున్నాడు. రిటైర్ అయిపోయి చాలా కాలం అయినా.. దిగ్గజాల లీగ్ లో సచిన్ ఆటను చూసేందుకు అవకాశం లభిస్తోంది.
క్రికెట్ అభిమానులకు మరో టీ20 లీగ్ వీనుల విందు చేయనుంది. నవంబర్ 17 నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) తొలి ఎడిషన్ మొదలవుతోంది. దిగ్గజ క్రికెటర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్‌కు సంబంధించిన ఫిక్షర్స్, కెప్టెన్ల వివరాలను నిర్వాహకులు వివరించారు.
నవంబర్ 17 నుంచి డిసెంబర్ 8 వరకు ఈ లీగ్ ఉంటుంది. ఈ లీగ్ లో మ్యాచులు ఇండియాలోని మూడు వేర్వేరు వేదికలపై (ముంబై, లక్నో, రాయ్‌పూర్) జరుగుతాయి. మొత్తం 18 మ్యాచ్‌లు ఉంటాయి.
భారత్ సహా ఆరు ఐసీసీ సభ్య దేశాలు ఈ లీగ్ లో పాల్గొంటాయి. భారత జట్టుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్క గా వ్యవహరిస్తారు. శ్రీలంక జట్టుకు కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా సారధ్య బాధ్యతలు చేపడుతున్నారు. అలనాటి క్రికెటర్ల ఆటను మళ్లీ చూడాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం.
లీగ్ ఫిక్షర్స్…
- నవంబరు 17- ఇండియా వర్సెస్ శ్రీలంక (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 18- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 17- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 20- వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 21- ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 23- ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 24- ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 25- వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 26- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 27- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
- నవంబర్ 28- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
- నవంబరు 30- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
- డిసెంబరు 1- ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
- డిసెంబరు 2- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
- డిసెంబరు 3- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
- డిసెంబరు 5- సెమీఫైనల్-1 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
- డిసెంబరు 6- సెమీఫైనల్-2 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
- డిసెంబరు 8- ఫైనల్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
Read also: MS Dhoni Six: మహేంద్రసింగ్ ధోని భారీ సిక్సర్లు.. వీడియో వైరల్.. సింహం సిద్ధమవుతోంది!!
MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌తో ప్రేమ.. స్టార్ హీరోయిన్ ఏమందంటే..
