బడా స్టార్ల వద్ద డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి పెద్ద మొత్తంలో జీత భత్యాలు, బహుమతులు అందుతుంటాయి. హీరోలు, హీరోయిన్ల వద్ద, వారి కుటుంబీకుల వద్ద డ్రైవర్లుగా పని చేస్తున్న వారి జీవితం గొప్పగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే అందులో కొంత వాస్తవం లేకపోలేదు. కానీ సోషల్ మీడియాలో రాసినంత, అందరూ ఊహించినంత పెద్దగా ఏమీ ఉండదంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వద్ద పని చేసే డ్రైవర్ లక్ష్మణ్. బన్నీ (Allu Arjun) డ్రైవర్ జీతంపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
ఓ టీవీ చానల్ యాంకర్ తో మాట్లాడిన అల్లు అర్జున్ (Allu Arjun) క్యారవ్యాన్ డ్రైవర్ లక్ష్మణ్ పలు విషయాలను పంచుకున్నాడు. తాను తొలుత స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వద్ద పని చేశానని తెలిపాడు. సుమారు ఐదున్నరేళ్ల పాటు బోయపాటి వద్ద డ్రైవర్ గా పని చేసినట్లు వెల్లడించారు. బేసిక్ గా తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తో ఫొటో దిగాలనే కోరిక ఉండేదన్నాడు. అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు.
అందుకే అల్లు అర్జున్ వద్ద డ్రైవర్ గా చేరినట్లు తెలిపాడు లక్ష్మణ్. ఇప్పటికే బన్నీ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న మహిపాల్ అనే వ్యక్తి ద్వారా తాను ఈ పోస్టులోకి వచ్చినట్లు వివరించాడు లక్ష్మణ్. అల్లు అర్జున్ కొత్త క్యారవ్యాన్ చేయించినప్పటి నుంచి తానే డ్రైవర్ గా ఉన్నట్లు చెప్పాడు. బన్నీ చాలా మంచివాడని, ఉద్యోగులను మంచిగా చూసుకుంటాడని వివరించాడు.
అలవైకుంఠపురం సినిమా హిట్ అయిన సందర్భంగా స్టాఫ్ అందర్నీ పిలిపించి బహుమతిగా నగదు అందించారని తెలిపాడు. ప్రత్యేకించి తన బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ గుర్తు పెట్టుకొని మరీ తన కోసం కేక్ తెప్పించి కట్ చేయించాడని ఇది జీవితంలో మరువలేనని లక్ష్మణ్ చెప్పాడు. ఇక జీతం విషయమై స్పందించిన డ్రైవర్ లక్ష్మణ్.. సోషల్ మీడియాలో రాసినట్లుగా, బయట ప్రజలు అనుకుంటున్నట్లుగా అంత రేంజ్ లో ఉండదని, కానీ సాధారణ డ్రైవర్ల కంటే బెటర్ గా ఉంటుందని తెలిపాడు. పండుగలు, సినిమాల హిట్ అయిన సందర్బాల్లో కానుకలు అందుతుంటాయని వివరించాడు.
Tabu: హీరోయిన్ టబుకు తండ్రి అంటే అసహ్యమట!
తబుస్సుమ్ ఫాతిమా హష్మి అలియాస్ టబు.. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. హైదరాబాద్ లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన టబు.. తర్వాత ముంబైలో స్థిరపడింది. తన స్నేహితురాలు దివ్య భారతి ద్వారా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు పరిచయమైంది. అనంతరం కూలీనెంబర్ 1 సినిమాతో తెరంగేట్రం చేసింది. 1971 నవంబర్ 4న జన్మించిన ఈ సుందరికి తన తండ్రి అంటే అస్సలు సరిపోదట. దానికి కారణాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తన బాల్యం గొప్పగా జరిగిందని చెబుతారు టబు. తన తల్లికి తండ్రి విడాకులిచ్చాక హైదరాబాద్‌లోని అమ్మమ్మవాళ్లింట్లోకి చేరినట్లు తెలిపింది. అక్కడే తన బాల్యం గడిచిందని వివరించింది. తన తల్లి టీచర్ కావడంతో తాను ఎక్కువగా అమ్మమ్మతోనే సమయం గడిపేదాన్ని అంటూ చెప్పింది. తన అమ్మమ్మ తన కోసం ఎన్నో పుస్తకాలు చదివి వినిపించేదని బాల్యాన్ని గుర్తు చేసుకుంది. ఆ విధంగానే తాను పెరుగుతూ వచ్చానంది.
టబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగింది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీల మేనకోడలైన టబు.. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టి టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ అగ్ర కథానాయికల్లో ఒకరిగా మంచి గుర్తింపు పొందింది. తన పేరులోనూ తబుస్సుమ్ ఫాతిమా హస్మీ అని అమ్మ పేరే ఉంటుంది. కానీ తండ్రి పేరునుగానీ, ఇంటి పేరును గానీ ఇప్పటి వరకు ఎక్కడ వాడలేదు టబు.
తన తండ్రి గురించి ఎప్పుడూ ప్రస్తావన రాలేదని టబు తెలిపారు. తన పేరులోని ఫాతిమా కూడా అమ్మ ఇంటి నుంచి వచ్చిందేనని, తండ్రి పేరు గానీ, ఆయన ఇంటి పేరుగానీ ఎప్పుడూ వాడాల్సిన అవసరం రాలేదని టబు చెప్పింది. తండ్రికి సంబంధించిన ఏ జ్ఞాపకాలూ తన వద్ద లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలా బతుకుతున్నానో, ఇకపై కూడా అలాగే జీవించాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇలాగే సంతోషంగా ఉందని వివరించింది.
Read Also : Uttej: అలాంటి పని చేస్తే నా కూతురిని చచ్చిపోవాలని చెప్పా.. ఉత్తేజ్!