Gurla: గత ప్రభుత్వంలో ఐదేళ్లలో గ్రామ స్వరాజ్యం సాకారమైతే నేడు ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు, అధ్వానమైన పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. డయేరియా (vizianagaram diarrhea) వ్యాప్తి చెందిన విజయనగరం జిల్లా గుర్లలో (Gurla) నేడు జగన్ పర్యటించారు. బాధితులకు తన పార్టీ తరఫున రూ.2 లక్షలు అందిస్తామని ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్ ఏమన్నారంటే..
ఈ రోజు గుర్ల (Gurla) గ్రామంలో కానీ.. గుర్ల మండంలో కానీ.. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులను చూస్తే ఇవాళ ఆశ్చర్యం కలిగించే విషయాలు మన కళ్ల ఎదుటే కనిపిస్తాయి. ఈ రోజు నేను అడుగుతున్నా.. మా హయాంలో గ్రామ స్వరాజ్యం అన్నది తీసుకు వస్తే ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం అయిన పరిస్థితులు కనిపిస్తుంటే.. ఈ రోజు పరిస్థితులు ఏమిటి అన్నది గమనించండి అని అందరినీ కోరుతున్నా.
ఆ రోజు వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏ గ్రామంలోకి వెళ్లినా.. ఆ గ్రామంలో సచివాలయాలు కనిపించేవి.. ఆ ప్రతి గ్రామంలో సచివాలయంలో మన పిల్లలు చిక్కగా నవ్వుతూ మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధంచిన పనులుచేసేవాళ్లు.
మనగ్రామంలోనే అక్కడే డిజిటల్ లైబ్రరీలు కనిపించేవి. మన గ్రామంలోనే అక్కడే గ్రామ సచివాలయాల్లో పనిచేసే పిల్లలు పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ చూసేవాళ్లు కనిపించేవాళ్లు. ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ చూసేవాళ్లు కనిపించేవాళ్లు. రెవెన్యూశాఖ కనిపించేది.. వెల్ఫేర్ శాఖ కనిపించేది.. డిజిటల్ అసిస్టెంట్లు కనిపించేవాళ్లు.. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేచేసేవాళ్లు..ఏఎన్ఎం, అగ్రికల్చర్, ఎనర్జీ, యానిమల్ హజ్బెండీ కనిపించేవాళ్లు.. అక్కడే విలేజ్ క్లినిక్‌లు కనిపించేది. 24/7 అక్కడే నివాసం ఉంటున్న సీహెచ్‌వోలు కనిపించేవాళ్లు. వాళ్లకు అనుసంధానంగా ఏఎన్ ఎంలు కనిపించేవాళ్లు.. అక్కడే వాళ్లకు రిపోర్ట్ చేస్తూ ఆశావర్కర్లు కనిపించేవాళ్లు.
విలేజ్ క్లినిక్‌లతో పాటు.. ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌లు రెండింటినీ అనుసంధానం చేసి పీహెచ్‌సీలో డాక్టర్లను పెంచి.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సప్ట్ కింద ప్రతి గ్రామానికి 15 రోజులుకు ఒకసారి వచ్చే వ్యవస్థ.
అదే గ్రామంలో నాడు నేడు కింద బాగు చేసిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపించేవి. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. చక్కగా ఈక్రాప్ జరిగిదేది. ఉచిత పంటల బీమా అందేది, పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందేది.
ఈ రోజు చూస్తే గ్రామ స్వరాజ్యం ఏ విధంగా తయారైందో గుర్ల గ్రామమే సాక్ష్యం. ఏకంగా 14 మంది డయేరియా వచ్చి చనిపోయిన పరిస్థితులు.. ఇదే గ్రామంలో నేను అక్టోబర్ 19న తేదీన నేను ట్వీట్ చేస్తే తప్ప ఈ గ్రామంలో 14 మంది చనిపోయారన్న విషయం చెప్పని పరిస్థితి. ఇదే గ్రామంలో సెప్టెంబర్ 20న ఇప్పటి నుంచి 35 రోజుల క్రిందట ఇదే మండలంలో పెనుబర్తి అనే గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయేంతటి తొలి డయేరియా కేసు నమోదు అయింది. 35 రోజులు తర్వాత కూడా ఎవరూ స్పందించని పరిస్థితి.
అక్టోబర్ 12వ తేదీ వచ్చే సరికి బాగా విస్తరించింది. గుర్ర, కోటగుండ్రేడు, గోషాడ, నాగలవలస గ్రామాలలల్లో ఉధృతంగా పబలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా డయేరియా వల్ల 14 మంది చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నా.. జగన్ అనే వ్యక్తి 11 మంది చనిపోయారని ట్వీట్ చేస్తే ఆ తర్వాత కూడా ప్రభుత్వం కదల్లేదు. కలెక్టర్ ఒక వ్యక్తి చనిపోయారని అంటారు. మంత్రులు దీనిని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే ఇక్కడ ఏకంగా అక్టోబర్ 24 వ తేదీ వచ్చేసరికి 14 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే సరికి చంద్రబాబు ఒప్పుకోక తప్పలేదు. 8 మంది చనిపోయారని చంద్రబాబు నోట్లు నుంచి వచ్చింది. పవన్ కల్యాన్ వచ్చి 10 మంది చనిపోయారని చెబుతారు. అప్పటి వరకు ఒప్పుకునే పరిస్థితిలేదు? (Gurla)
ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పి జరిగిన తప్పను సరిదిద్దుతారా అంటే అదీ లేదు. పక్కనే చంపానది.. ఆ నదిలో ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో నీళ్లు ఉన్నాయో చూస్తేనే తెలిసిపోతుంది. చంపానదిపై ఉన్న సీడబ్ల్యూసీ, పీడబ్ల్యూవై స్కీం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలలగా కనీసం మెయింటెన్స్ రెన్యువల్ చేయకపోవగా.. దానికి ఫిల్టర్లు మార్చారా లేదా? దానికి సంబంధించిన ట్యాంకుల్లో క్లోరినేషన్ జరిగిందా లేదా? అనే కనీస ఆలోచనలు కూడా చేయలేదు.
5 నెలల కాలంలో శ్యానిటేషన్ ఒకటి ఉంటుంది.. సచివాలయ వ్యవస్థ ఒకటి ఉంటుంది.. వారి సహాయ సహకారాలు తీసుకోవలి.. శ్యానిటేషన్‌పై ద్యాస పెట్టాలి అనేది పట్టించుకోలేదు. నీళ్లు సప్లై చేసే సీపీడబ్ల్యూఎస్ స్కీంలు కానీ.. వాటర్ ట్యాంకుల మెయింటెన్స్ పై కానీ ధ్యాస పెట్టిన దాఖలు లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ మండలానికి సంబంధించి 345 మంది చేరారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా మరో 100 మందికి పైగా చికిత్సలు పొందుతున్నారు.
గరివిడి, గజపతినగరం, గద్దిరాజేరు మండలాలల్లో ఇప్పటికే డయేరియా వల్ల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ కూడా 62 మంది చికిత్స పొందుతున్నారు. నేను అడుగుతున్నది ఒక్కటే ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని అడుగుతున్నా. ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి? ఆ ఇష్యూని ఎలా కవరప్ చేయాలి? ఆ ఇష్యూ అసలు జరగనట్లుగా ఎలా చూపించాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. నిజంగా ఈ ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి.
గుర్లమండలంలో 14 మంది చనిపోయారు. విజయనగరం హెడ్ క్వార్టర్ లో కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలను అక్కడికి ఎందుకు తీసుకోలేకపోయారు. విశాఖపట్నంకు 10 అంబులెన్స్‌లను పిలిపించి అందరికీ విశాఖపట్నంకు ఎందుకు తీసుకెళ్లేలేకపోయారు అని అడుగుతున్నా.
ఎంతటి దారుణంగా గ్రామీణ ప్రజల పట్ల ఈ ప్రభుత్వం ఎంతటి అశ్రద్ధ చూపిస్తుందో అర్థమవుతోంది. మా ప్రభుత్వం మెరుగుపరిచిన స్కూల్ బెంచీలమీద పేషెంట్లు కనిపిస్తున్నారు. అక్కడ వైద్యం చేస్తున్నారు. మా హయాంలో విజయనగరంలో మెడికల్ కాలేజీ ఇచ్చాం. 17కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరానికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నంకు ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? ఈ గ్రామంలో 9 మంది, ఈ మండలంలో 14 మంది చనిపోయినందుకు బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నా.
ఈ గ్రామంలోని కొంతమందిని ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించందా అని అడిగా.. సహాయం చేయకపోగా.. అస్పత్రికి వెళ్లితే అక్కడ వాళ్లు చెబుతున్నది ఏంటంటే.. డయేరియా వల్ల చనిపోయారని చెప్పొద్దని, గ్రామంలో దీని వల్ల ప్యానిక్ సిచ్చివేషన్ వస్తుందని.. గుండెపోటుతో చనిపోయారని చెప్పండి అని ఉచిత సలహాలు ప్రభుత్వం ఇస్తోంది అంటే ఎంతటి దౌర్భాగ్యం పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థమవుతోంది.
ఈ ప్రభుత్వం కనీసం వీళ్లకు సహాయం చేయకపోగా, గ్రామీణ వ్యవస్థను, విలేజ్ క్లినిక్స్ ను, పీహెచ్‌సీలను బాగుపర్చకపోగా, సీహెచ్‌సీలో స్పెషలిస్ట్ డాక్టర్లను తీసేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీరో వేకెన్సీ పాలసీని మా ప్రభుత్వం తీసుకొస్తే రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు మార్చి నుంచి కట్టక, దాదాపు రూ.1800 కోట్లు బకాయిలు పేరుకుపోయి ఈరోజు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితిలో వ్యవస్థ కనిపిస్తోంది.
మా ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు కట్టడం మొదలు పెట్టి, 5 కాలేజీలు పూర్తి చేసి నడపడం మొదలు పెట్టింది. మిగిలి ఉన్న 12 కాలేజీలను పూర్తి చేసి నడపాల్సిన ఈ ప్రభుత్వం.. ఏకంగా సీట్లు మాకు వద్దు అని ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపుతోంది. ఏకంగా ఆ 12 మెడికల్ కాలేజీలకు, ఇంతకు ముందు మేం కట్టిన 5 మెడికల్ కాలేజీలను అన్నింటినీ అమ్మేయడానికి, తనకు అనుకూలమైన వారికి స్కాములు చేస్తూ అమ్మేయడానికి అడుగులు వేస్తోంది.
ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. కేవలం 1,000 ప్రొసీజర్లకు గతంలో పరిమితం చేస్తే, దాన్ని 3,300 ప్రొసీజర్లకు మా ప్రభుత్వం తీసుకెళ్లింది. ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇచ్చే కార్యక్రమానికి మా ప్రభుత్వం శ్రీకారం చుడితే, ఈరోజు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరాను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ చనిపోయిన 14 కుటుంబాలకు ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ తరఫున ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీగా సహాయ సహకారాలు అందిస్తూ రూ.2 లక్షలు ప్రతి కుటుంబానికీ అందిస్తాం.
ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేమే సహాయం చేయడానికి ముందుకొచ్చాం. అధికారంలో ఉన్నపార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆదుకోవాల్సిన పార్టీగా మీరు ఎంత ఇవ్వబోతున్నారు? అని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తున్నా. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి వాస్తవాలను ప్రజలతో పంచుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పి సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకేయాలని ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని పైనున్న దేవుడిని కూడా ప్రార్థిస్తున్నా.’’ అని జగన్ చెప్పారు.
ఇవీ చదవండి: Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!
YS Jagan bail: జగన్ బెయిల్ రద్దు ప్రమాదం!
Jagan vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల.. ఆస్తుల గొడవల్లో అసలేం జరిగింది?
YS Jagan at GGH: ఏరి ఏరి మరీ జైళ్లలో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్!
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
