HomeAndhra PradeshDachepalle: దాచేపల్లిలో ఇద్దరి మృతి.. డయేరియానా? ప్రభుత్వం ఏమంది?

Dachepalle: దాచేపల్లిలో ఇద్దరి మృతి.. డయేరియానా? ప్రభుత్వం ఏమంది?

Dachepalle: పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతి చెందారు. ఇప్పటికే విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విజృంభించి దాదాపు 12 మందికి పైగా చనిపోయారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దాచేపల్లిలో (Dachepalle) మరణాలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రివ్యూ చేశారు.

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ.. కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్, ఆర్డీఎంఏ హరికృష్ణ, డీఎంహెచ్‌వో రవికుమార్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, నగర పంచాయతీ కమిషనర్ అప్పారావులతో సమీక్షించారు. నీరు కలుషితం కావడం వల్ల చనిపోయారా? లేక వేరే కారణాలున్నాయా? అనే దానిపై స్పష్టత ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాలని మంత్రి సూచించారు.

స్థానికంగా ఉన్న బోర్లలో నీటిని విజయవాడ ల్యాబ్ కు పరీక్షలకు పంపాలని మంత్రి నారాయణ సూచించారు. బోర్లను అన్నింటిని మూసివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో ఆరుగురు ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ వెల్లడించారు.

హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుధ్య పనులు ముమ్మరం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. డ్రెయిన్ లతో పూడిక యుద్ద ప్రాతిపదికన తొలగించడంతో పాటు మంచి నీటి బోర్లను అన్నింటిని తనిఖీ చేయాలని మంత్రి సూచనలు చేశారు. అవసరమైతే ఇతర మున్సిపాల్టీల నుంచి సిబ్బందిని రప్పించాలని మంత్రి సూచించారు. సాధారణ పరిస్థితి వచ్చే దాకా మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని సూచనలు చేశారు.

మరోవైపు దాచేపల్లి ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిపై కలెక్టర్ తో మాట్లాడారు. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డయేరియా లక్షాణాలున్న ప్రాంతాల్లో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వైద్య శిబిరాల సంఖ్య పెంచాలని కోరారు. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. సంబంధిత ప్రాతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్ ముమ్మరం చేయాలన్నారు. డయేరియా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఆర్వో ప్లాంట్ నీళ్లు తాగవద్దు
దాచేపల్లి అంజనాపురం కాలనీని కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. తాగునీటి కలుషితం వల్ల కొంతమంది అస్వస్థతకు గురయ్యారని, అంజనాపురంలో ఇప్పటివరకు 6 కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. కాలనీలో ఎక్కువమంది స్థానిక ఆర్వో ప్లాంట్ నుంచి నీరు తెచ్చుకుంటున్నారన్నారు. ఎవరూ ఈ ఆర్వో ప్లాంట్ నీళ్లు తాగవద్దని కోరారు. మున్సిపాలిటీ అధికారులు క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేస్తారన్నారు. నీటి నమూనాలను పరీక్షలకు విజయవాడ ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు. కాలనీలోనే పైపు లైన్లకు లీకేజీలు ఉన్నట్లు గుర్తించామని, పైపు లైన్ల లీకేజీలను మున్సిపల్ సిబ్బందితో బాగు చేయిస్తామన్నారు.

ఇవీ చదవండి: Vizianagaram Crime: గుర్లలో డయేరియా మృతులు ఎంతమంది? ప్రభుత్వం ఏమందంటే..
Diarrhea Vizianagaram: డయేరియా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి
Gurla: నాడు గ్రామ స్వరాజ్యం.. నేడు ఎక్కడ చూసినా దయనీయం
Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు