HomeAndhra PradeshYS Jagan with Tobacco Farmers: చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం.. పొగాకు రైతులతో...

YS Jagan with Tobacco Farmers: చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం.. పొగాకు రైతులతో భేటీలో వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

YS Jagan with Tobacco Farmers: రాష్ట్రంలో ప్రభుత్వ తీరు వల్ల పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారికి తాము అండగా, తోడుగా నిలుస్తామని, వారి సమస్యలపై పోరాడుతామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆ దిశలోనే 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి, పొగాకు రైతులను కలుసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం అని, ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదని, చిరకు ఆక్వా రైతులదీ అదే పరిస్థితి అని గుర్తు చేశారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి, యథేచ్ఛగా దోచుకుంటున్నారని తెలిపారు. సీజన్‌ ముగుస్తున్నా, ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు లేవని, ఇప్పటి వరకు 20 శాతం కొనుగోళ్లు కూడా జరగలేదని చెప్పారు. పొగాకు రైతుల కష్టాలు తీరేలా పోరాడుతామన్న జగన్, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వెల్లడించారు.

నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పొగాకు సాగు చేస్తున్న రైతుల్లో ముఖ్యులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ భేటీ అయ్యారు. వారి సమస్యలన్నీ సావధానంగా విన్న ఆయన, వారికి అండగా తానున్నానంటూ ఎంతో భరోసా ఇచ్చారు. పొగాకు రైతుల సమావేశంలో జగన్‌ ఏం మాట్లాడారంటే..:

94 రోజులు గడిచినా..

పొగాకుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతన్నలందరూ తమ బాధలు ప్రస్తావించారు. ఏ రకంగా ఇవాళ్టికి దాదాపు 94 రోజులు అయినప్పటికీ కూడా, 20 శాతం కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మామూలుగా 100 రోజుల్లోనే పొగాకు కొనుగోళ్లు పూర్తి కావాలి. అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంతవరకు కేవలం 38 మిలియన్‌ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. పండిందేమో 232 మిలియన్‌ కేజీలు. కొనుగోలు చేసిందేమో 38 మిలియన్‌ కేజీలు. అంటే పండిన పంటలో కేవలం 16.5% మాత్రమే కొనుగోలు చేశారు. 100 రోజుల్లో మొత్తం కొనుగోళ్లు పూర్తి కావాల్సిన చోట, 94 రోజులు అయినా కూడా ఇంత తక్కువ శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగిన నేపథ్యంలో, ఏ రకంగా రైతు బ్రతకగలుగుతాడు? అసలు ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది? ఇక్కడ అర్ధమవుతోంది ఏమంటే.. కర్ణాటకలో సెప్టెంబరులో పొగాకు కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పుడు సగం మంది ట్రేడర్లు సహజంగా అటువైపుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి, అందుకని ఫుల్‌ స్టాప్‌ పెట్టే కార్యక్రమమే జరిగింది.

చంద్రబాబు మాటకు విలువ లేదు

ఇప్పుడు మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళనల మధ్య, చంద్రబాబునాయుడుగారు రివ్యూ మీటింగ్స్‌ పెట్టి పొగాకు ధర కేజీ రూ.200 కు తగ్గకూడదని చెప్పిన మర్నాడే పొదిలిలో రూ.179, టంగుటూరులో రూ.184, కనిగిరిలో రూ.184, కందుకూరులో రూ.186, జంగారెడ్డిగూడంలో రూ.170, గోపాలపురంలో కూడా రూ.170. ఈ రేట్లు తగ్గిపోయి కొనుగోలు చేస్తున్నారు అంటే, సిండికేట్‌ ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం.

టుబాకో బోర్డు బోర్డు లక్ష్యం ఏమిటి?

అసలు టుబాకో బోర్డు ఎందుకు పెట్టారు? రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్‌ఫామ్‌ మీదకి తీసుకొచ్చి, ఆ ప్లాట్‌ఫామ్‌లో వివిధ రకాల వ్యాపారులు పార్టిసిపేట్‌ చేస్తే, ఒక పోటీ వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టుబాకో బోర్డు ఏర్పాటు జరిగింది. కానీ చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వ పుణ్యాన పరిస్థితి ఎలా మారిందంటే.. ఆయనగారు అధికారంలోకి వస్తూనే సిండికేట్‌లో అందరికీ కొమ్ములు వస్తాయి. సిండికేట్‌ మొత్తం ఏకమై, చంద్రబాబునాయుడు చెప్పేది చెబుతూ ఉంటాడు.. మనం చేసేది మనం చేస్తుంటాం అన్న ధైర్యంతో ఉంటారు. ఈ ఒక్క పంటే కాదు. ఏ పంట పరిస్థితి అయినా అంతే. దళారీలే వ్యవస్థను నడుపుతున్నారు. అందుకే వెంటనే ధరలు పతనం అయిపోయి, చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితి. దీంతో రైతులు విసిగిపోయి, ఏదో ఒక రేటుకు కొనండి. మమ్మల్ని బ్రతికించండి స్వామి అనే పరిస్థితి. అలా రైతులు తెగ అమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతున్న దారుణ పరిస్థితి కనిపిస్తోంది.

మా ప్రభుత్వంలో ‘మార్క్‌ఫెడ్‌’ ను దించాం

ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో మన ప్రభుత్వ హయాంలో మార్క్‌ ఫెడ్‌ ను పోటీగా దించాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మార్క్‌ ఫెడ్‌ ను కూడా ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకొచ్చాం. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అలా మార్క్‌ఫెడ్‌ను ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చి, ఎప్పుడైతే కొనుగోళ్లలో పార్టిసిపేట్‌ చేసే కార్యక్రమం చేసిందో, ఎప్పుడైతే రైతుల తరపున మార్క్‌ ఫెడ్‌ రంగప్రవేశం చేసిందో, అప్పుడు మార్కెట్లో ఒక పోటీ మొదలైంది. అప్పుడు మార్కెట్లో మనం ఆ రకమైన కాంపిటీషన్‌ క్రియేట్‌ చేయగలిగాం కాబట్టి, సిండికేట్‌ను కూడా బ్రేక్‌ చేశాం. సిండికేట్‌ కాటన్‌ ఎప్పుడైతే బ్రేక్‌ అయిందో, గవర్నమెంట్‌ ఎప్పుడైతే సీరియస్‌గా తీసుకోవడం మొదలు పెట్టిందో, అప్పుడు భయం మొదలై రేట్లు పెరిగాయి. ఆ మేరకు 2023–24లో మా ప్రభుత్వ హయాంలో కేజీ పొగాకు సగటు ధర రూ.289 కాగా, ఆ ఏడాది అత్యధికంగా రూ.411కి కొనుగోళ్లు జరిగాయి. అది అత్యుత్తమ ధర అని అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రిపోర్టు ఇచ్చింది.

మరి ఇప్పుడు ఏం జరుగుతోంది?

అదే ఈరోజు చంద్రబాబునాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే. అంత తక్కువ పంట కొనుగోలు చేసిన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు చూస్తే నో బిడ్లు. భారీగా పొగాకు బ్యారెళ్లు రిజెక్ట్‌ చేయడం కనిపిస్తోంది. మరి అలా చేస్తున్న కంపెనీలపై చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఇంతవరకు ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని లైసెన్సులు సస్పెండ్‌ చేశారు? ఎంత మందిని బ్లాక్‌లిస్టులో పెట్టారు? అంటే, ఇంత వరకు లైసెన్సులు సస్పెండ్‌ చేసింది లేదు. ఎవరినీ బ్లాక్‌లిస్టులో పెట్టింది లేదు. అలా చంద్రబాబునాయుడుగారు ఏ రకమైన భయాన్ని కలిగించకుండా, మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి రానివ్వకుండా మొత్తం అడ్డుకుంటే రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది?.

రైతులకు లాభం జరగాలంటే..

రైతులకు లాభం జరగాలి అని అంటే.. రెండు జరగాలి. ఒకటి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి. అలా ప్రభుత్వం రైతుల తరపున నిలబడడానికి సీరియస్‌గా ఉంది అని మెసేజ్‌ ఇవ్వాలి. రెండోది. ఎవరైతే లైసెన్స్‌దార్లు ఉన్నారో.. వాళ్ళందరికీ లైసెన్సులు ఎందుకు ఇచ్చారు?. వాళ్లు ఫలానా రేటుకు పంట కొంటాము. ఇంత పంట మీరు వేయండి అని చెప్పారు కాబట్టి, రైతులందరూ పంట వేశారు. ఇంత క్వాంటిటీకి మీరు వేయండి అని వాళ్ళు చెప్తేనే కదా, మనం పంట కూడా వేశాం. వాళ్ళు చెప్పిన ఆ క్వాంటిటీ కొనుగోలు చేస్తామని చెప్పి, అషూరెన్స్‌ ఇచ్చిన క్వాంటిటీ, రైతులు నష్టపోకుండా లాభం వచ్చే రేటుకి వాళ్ళు కొనుగోలు చేయాలి కదా? అది వారి నైతిక బాధ్యత కూడా. మరి ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించినప్పుడు, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఈ రకంగా సిండికేట్‌ ఫామ్‌ అయితే, ప్రభుత్వం ఒప్పుకోదు. ఈ రకంగా సిండికేట్‌ ఫామ్‌ అవుతే, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అన్న సంకేతం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, అప్పుడే సిండికేట్‌ వ్యవస్థ అనేది బ్రేక్‌ అవుతుంది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.

ఈ ప్రభుత్వంలో అవేవీ జరగవు

కానీ, చంద్రబాబునాయుడుగారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఏవీ జరగవు. ఒక రైతు అన్న ఇంతకు ముందు చెప్పినట్లు.. ఐదు సంవత్సరాలు వరుసగా పక్కన తెలంగాణకు 100 మీటర్ల దూరంలో మన ఆంధ్ర ఉంది. పక్కన తెలంగాణలో ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌ 18.9% ఉంటే, ఆంధ్రాలో దాన్ని 14 శాతానికి అటు ఇటు పెట్టారు. క్లియర్‌కట్‌గా 100 మీటర్లు అవతల ఒక ఫ్యాక్టరీలో ఆ మేరకు ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేటు బెటర్‌గా ఉండి, రైతులకు బెటర్‌ రేట్‌ అక్కడ వస్తుంటే.. ఇక్కడ ఆంధ్రలో ఐదు సంవత్సరాలు చంద్రబాబునాయుడు హయాంలో ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ పర్సెంటేజ్‌ తగ్గించి, రైతులు నష్టపోయేలా చేసినా, పట్టించుకునే నాథుడు లేడు. రైతులు నష్టపోనిలే అన్నట్లుగా వ్యవహరించిన తీరు.

అదే నాడు మన ప్రభుత్వం వచ్చాక..

రైతులు ఎప్పుడు నష్టపోకూడదు. రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగు పడుతుంది. రాష్ట్రం బాగుండాలి అంటే, రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి అని చెప్పి.. రైతు పక్షపాత ప్రభుత్వంగా మనం వచ్చినప్పుడు మాత్రమే మార్పులు జరిగాయి. మనం వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్‌పామ్‌లో ఆ వ్యత్యాసం తీయడం జరిగింది. నేను ఆ మార్పు చేసి ఆయిల్‌పామ్‌ సాగులో నష్టపోయిన రైతులకు దాదాపు రూ.90 కోట్లు ఇచ్చి అండగా నిలబడి, ఒక మెసేజ్‌ పంపించాను. ఆ మెసేజ్‌ పంపించడంతో, ఆ తర్వాత రేట్లన్నీ ఆటోమేటిక్‌గా 10 ఏళ్లు పెరుగుతాయి.

ఇంకా రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం తరపు నుంచి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ తీసుకొచ్చి, ఆ 5 ఏళ్లలో రైతుల తరపున రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బికేను ఒక కేంద్రంగా ప్రకటించి, ప్రతి జిల్లాలోనూ జాయింట్‌ కలెక్టర్‌ మార్క్‌ ఫెడ్‌ జాయింట్‌ ఎండిగా ప్రకటించాం. ప్రతి ఆర్బికేలో పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించి, ఆ వివరాలతో ఏకంగా ఒక బోర్డు పెట్టాం. ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకు ఏదైనా పడిపోతే, వెంటనే ఆర్బికే పరిధిలో ఉన్న అసిస్టెంట్‌ అగ్రికల్చరల్‌ గ్రాడ్యుయేట్‌ వెంటనే అలర్ట్‌ సిగ్నల్‌ ఇచ్చేవాడు. ఆ అలర్ట్‌ సిగ్నల్‌ సీఎం–యాప్‌ (కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌)ని యాక్టివేట్‌ చేసేది. దాంతో ఏ ఆర్బికే పరిధిలో అయితే పంట ధర పడిపోయిందో, అక్కడ జాయింట్‌ కలెక్టర్‌ ఎంటర్‌ అయి, వెంటనే పంట కొనుగోలు చేసేవాళ్లు. అలా రేటులో పోటీ ఏర్పడేది. దాని వల్ల ఏ రైతూ నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. ఆ ప్రక్రియలో ఏకంగా రూ.7,800 కోట్లు మనం ఖర్చు చేశాం కాబట్టే, ఏ పంటకు, ఏ రైతు ఆరోజు నష్టపోలేదు. అందుకే అప్పుడు గిట్టుబాటు ధర రాని పరిస్థితి అనేది ఏ రోజు ఒక ఇష్యూ కింద కూడా రాలేదు. రైతులకు ప్రభుత్వం ఉందన్న భరోసా ఎప్పుడైతే మార్కెట్‌లోకి వెళ్ళిపోయిందో, ఆటోమేటిక్‌గా ప్రతి పంటకు రేట్లు వచ్చాయి. కానీ, ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా సన్నగిల్లిపోయింది. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదు అన్న మెసేజ్‌ ఉంది కాబట్టి, దళారీల వ్యవస్థ ఈరోజు సిండికేట్‌గా మారి, రైతులందరినీ పూర్తిగా నష్టపరుస్తోంది.

రైతులకు అండగా పోరాడుతాం

అందుకే రైతులకు తోడుగా నిలుస్తాం. ప్రభుత్వాన్ని మేలుకొలిపే కార్యక్రమం చేయగలిగినంత చేస్తాం. రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా, మనం ఏదైనా చేయాలంటే మూడేళ్లు ఓపిక పట్టాల్సిందే. అయినా ఆలోపు కచ్చితంగా రైతుల తరపున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం. అలా అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. ఏయే జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారో.. అక్కడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా నిలబడుతుంది.

అలాగే వారం, పది రోజుల్లో నా పర్యటన కూడా ఉంటుంది. గత ఏడాది ప్రకాశం జిల్లాకు వెళ్లాను కాబట్టి, ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురంలో కానీ, జంగారెడ్డిగూడెంలో కానీ పర్యటిస్తాను. అలా పొగాకు రైతుల సమస్యను రాష్ట్రమంతా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోతే, కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తాము. ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్ర పోయే వాళ్ళను లేపొచ్చు. కానీ, నిద్ర నటించే వాళ్లను లేపడం కష్టం. అయినా గట్టిగా ప్రయత్నించి, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తామని జగన్‌ వివరించారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan Delhi Tour: వచ్చేవారం ఢిల్లీకి వైఎస్ జగన్? మోడీ-అమిత్ షాతో భేటీ? రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?
YS Jagan in Bheemavaram: మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను: ఆక్వా రైతులు, రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటాం: భీమ‌వ‌రంలో వైఎస్ జ‌గ‌న్
Puri Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరు? శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట సంప్రదాయం వెనుక అసలు కారణం ఇదే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు