Jagan in Gurla: ప్రతి అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. వ్యతిరేకత వచ్చే అంశాలు తెరపైకి వస్తే వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేస్తోందన్నారు. తన కుటుంబంలో ఆస్తుల గొడవలపైనా జగన్ తొలిసారి స్పందించారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులు, మృతి చెందిన కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
’’ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఏదైనా ఒక విషయం వస్తే, ఆ విషయంలో స్పందించాల్సిన పరిస్థితిలో స్పందించకుండా ఆ ఇష్యూను ఎలా డైవర్ట్ చేయాలని ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద ఢిల్లీ లో మేము ప్రొటెస్ట్ చేస్తే, ఓ హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని, రెవెన్యూ సెక్రటరీని మదనపల్లెకు పంపించి అక్కడ ఫైళ్లు కాలిపోయాయని చెబుతారు.
ఇక్కడ ఈ గ్రామంలో, మండలంలో 14 మంది చనిపోతే హెలికాప్టర్లు కాదు కదా, కనీసం మంత్రులు కూడా రాలేదు. డైవర్షన్ పాలిటిక్స్ లో వంద రోజుల పాలన మీద చంద్రబాబును గట్టిగా నిలదీసే పరిస్థితి. 100 రోజులు అయిపోయింది చంద్రబాబూ.. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సెవెన్ అన్నావు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు, నీకు 15 వేలు అన్నాడు. ఆ ఇంట్లో చిన్న పిల్లల తల్లులు కనిపిస్తే నీకు 18 వేలు, నీకు 18 వేలు అన్నాడు. ఆ ఇంట్లో చిన్న పిల్లల తల్లుల పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48, నీకు 48 వేలు అన్నాడు. ఆ ఇంట్లో 18-20 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న పిల్లలు కనిపిస్తే నీకు 36 వేలు, నీకు 36 వేలు అన్నాడు. ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకుని రైతు బయటకొస్తే నీకు 20 వేలు, నీకు 20 వేలు అన్నాడు.
మరి ఎన్నికలప్పుడు ఇవన్నీ చెప్పి మోసం చేస్తున్నాడు అని 100 రోజుల ఆయన పాలన మీద చంద్రబాబును గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు.. తిరుపతి లడ్డూ అంటాడు. టాపిక్ ను డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు తప్పించుకునే కార్యక్రమం చేస్తాడు. ప్రతి టాపిక్ లోనూ డైవర్షన్, డైవర్షన్, డైవర్షన్.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితలు చెల్లాచెదురు అవుతున్నాయి, చిన్న పిల్లల జీవితాలు చెల్లా చెదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మలపై దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు. మరోవైపున జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తెస్తున్నాడు.
జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతున్నాడు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తున్నాడు, జగన్ బద్వేలుకు బయల్దేరుతున్నాడు, జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తున్నాడు.. ఇక్కడ గుర్ల గ్రామంలో కూడా 14 మంది చనిపోయిన పరిస్థితులు.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ వస్తున్నాడని తెలిసే సరికే మళ్లీ టాపిక్ డైవర్ట్..
ఈసారి మా చెల్లెలి ఫొటో పెడతారు, మా అమ్మ ఫొటో పెడతారు, నా ఫొటో పెడతారు. అయ్యా చంద్రబాబు, రాధాకృష్ణా, ఈనాడు, అయ్యా టీవీ5.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా? అని అడుగుతున్నా. అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్ కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా ఇంకా కొంత వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ధ్యాస పెట్టండి. ప్రజలకు జరుగుతున్న కష్టాల్లో పాలు పంచుకోండయ్యా చంద్రబాబూ.. అని అడుగుతున్నా. ఈ మీడియా ముసుగులో చంద్రబాబు మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈ దత్తపుత్రుడిని కూడా అడుగుతున్నా. వీటిమీద ధ్యాస పెట్టండి.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: YS Jagan bail: జగన్ బెయిల్ రద్దు ప్రమాదం!
Jagan vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల.. ఆస్తుల గొడవల్లో అసలేం జరిగింది?
YS Jagan at GGH: ఏరి ఏరి మరీ జైళ్లలో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్!
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
