HomeAndhra PradeshJagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?

Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?

Jagan on Badvel murder: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో (Jagan on Badvel murder) ట్వీట్ చేశారు.

’’లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు.

చంద్రబాబుగారూ మీరు వైయస్సార్‌సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్రప్రజలమీద కక్షసాధిస్తున్నారు. ఇది అన్యాయంకాదా? వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనంకాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకంచేసిన మాట వాస్తవం కాదా?

“దిశ’’ యాప్‌లో SOS బటన్‌ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ రూంకు, అక్కడనుంచి దగ్గర్లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్‌చేస్తారు. వారు ఫోన్‌ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లోచెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్‌ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’’పై రాజకీయ కక్ష ఎందుకు?

దిశ కార్యక్రమాన్ని బలోపేతంచేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్‌ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్‌స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్‌ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.

వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబుగారూ? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్‌ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబుగారూ?’’ అని వైయస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Jagan Press Meet: మారిన జగన్.. ఇకపై రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు? సర్కారుపై ఏమన్నారంటే..
Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవు.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు
YS Jagan Meeting: సంస్థాగత నిర్మాణంతో దేశంలోనే బలమైన పార్టీగా ఎదగాలి
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
YS Jagan on Mopidevi: మోపిదేవి పార్టీ వీడటంపై జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan Good Book: గుడ్ బుక్ రాస్తున్నాం.. ప్రమోషన్లు కల్పిస్తాం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు