HomeBusinessSamsung Galaxy S27 Ultra: 60W ఫాస్ట్ ఛార్జింగ్.. S27 Proలోనూ ఇదే స్పీడ్, లాంచ్...

Samsung Galaxy S27 Ultra: 60W ఫాస్ట్ ఛార్జింగ్.. S27 Proలోనూ ఇదే స్పీడ్, లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy S27 Ultra: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో పెద్దగా మార్పులు చేయకుండా వస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా 45W ఛార్జింగ్‌కే పరిమితమైన శాంసంగ్.. Galaxy S26 Ultraతో తొలిసారి 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు అప్‌గ్రేడ్ అయింది. ఇప్పుడు తదుపరి తరం Galaxy S27 Series గురించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. చైనా 3C సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. Galaxy S27 Ultraతో పాటు కొత్తగా రానున్న Galaxy S27 Pro కూడా 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో శాంసంగ్‌ ఎస్‌ సిరీస్‌లో ఛార్జింగ్ స్పీడ్ విషయంలో మరో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Galaxy S27 Pro, S27 Ultra 3C సర్టిఫికేషన్

చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో SM-S9570, SM-S9580 మోడల్ నంబర్లతో రెండు శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లు కనిపించాయి. GSMA IMEI డేటాబేస్‌లోని వివరాలను పరిశీలిస్తే.. ఇవి మార్కెట్లో Galaxy S27 Pro, Galaxy S27 Ultra పేర్లతో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రెండు ఫోన్లకు సంబంధించిన 3C సర్టిఫికేషన్‌లో 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు సమాచారం. అంటే S26 Ultraలో శాంసంగ్‌ తీసుకొచ్చిన 60W ఛార్జింగ్ టెక్నాలజీని S27 Ultraలోనూ కొనసాగించనున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో కొత్తగా వస్తుందని భావిస్తున్న S27 Pro కూడా 60W ఛార్జింగ్‌ను పొందనుండటం ఆసక్తికరంగా మారింది.

తొలిసారి Pro మోడల్?

Galaxy S27 Pro విషయంలో మరో విషయం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో సాధారణంగా Galaxy S, Galaxy S Plus, Galaxy S Ultra మోడళ్లను విడుదల చేస్తూ వచ్చింది. కానీ ఈసారి Galaxy S27 Pro పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురానున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే.. శాంసంగ్‌ ఎస్‌ సిరీస్‌లో Pro బ్రాండింగ్‌తో వచ్చే తొలి ఫ్లాగ్‌షిప్ ఇదే అవుతుంది. అయితే ఫోన్ పేరు, ఫీచర్లు, మార్కెట్‌ వారీగా వేరియంట్లపై శాంసంగ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Galaxy S27, S27 Plus ఛార్జింగ్ ఎంత?

ఇప్పటికే Galaxy S27 సిరీస్‌లోని మరో రెండు మోడళ్లు కూడా చైనా 3C సర్టిఫికేషన్‌లో కనిపించినట్లు సమాచారం. Galaxy S27 (SM-S9520) మోడల్ 45W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు Galaxy S27 Plus (SM-S9650) కేవలం 27W ఛార్జింగ్‌కు పరిమితం కానుందని సమాచారం. దీంతో S27 సిరీస్‌లో ఛార్జింగ్ స్పీడ్ విషయంలో మోడళ్ల మధ్య గణనీయమైన తేడా ఉండే అవకాశం ఉంది.

మోడల్ అంచనా ఛార్జింగ్ స్పీడ్
Galaxy S27 45W
Galaxy S27 Plus 27W
Galaxy S27 Pro 60W
Galaxy S27 Ultra 60W

ఛార్జర్ మాత్రం బాక్సులో ఉండదా?

శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కొనసాగుతున్న సంప్రదాయం S27 సిరీస్‌లోనూ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అంటే ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసినప్పటికీ.. రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించే అవకాశం లేదు. అందువల్ల 60W స్పీడ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు అనుకూలమైన ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి రావచ్చు.

వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా..

ఛార్జింగ్ విషయంలో వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు Galaxy S27 సిరీస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉండనున్నట్లు సమాచారం. అయితే వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సంబంధించిన స్పీడ్, బ్యాటరీ కెపాసిటీ వంటి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ముందుగానే 3C సర్టిఫికేషన్.. జనవరిలోనే లాంచ్?

Galaxy S27 సిరీస్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఫోన్లు సాధారణం కంటే చాలా ముందుగానే 3C సర్టిఫికేషన్ పొందుతున్నాయి. గతంలో Galaxy S26 సిరీస్ 3C డేటాబేస్‌లో 2026 జనవరిలో కనిపించగా.. ఆ తర్వాత మార్చిలో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు Galaxy S27 సిరీస్‌కు చెందిన నాలుగు మోడళ్లు ఇప్పటికే 3C సర్టిఫికేషన్ పొందినట్లు సమాచారం. దీంతో Galaxy S27 Seriesను 2027 జనవరిలోనే శాంసంగ్‌ విడుదల చేసే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి.

అయితే లాంచ్ తేదీ, ఫీచర్లు, ధర తదితర వివరాలు ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించబడలేదు. 3C సర్టిఫికేషన్ ఆధారంగా చూస్తే మాత్రం S27 Pro, S27 Ultraలో 60W ఛార్జింగ్‌ ఈసారి శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కీలకమైన అప్‌గ్రేడ్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

Read also: Samsung Galaxy Z Fold 8: అంచనాలకు మించి హిట్.. ఫోల్డ్ 8 కోసం ఇంత క్రేజ్ ఎందుకు?
Samsung: ఫోల్డబుల్ ఫోన్లకు భారీ క్రేజ్.. లాంచ్‌కు ముందే రికార్డు ప్రీ-ఆర్డర్లు.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్?
Samsung: Galaxy Z Fold8, Fold8 Ultra స్పెక్స్ లీక్.. టైటానియం డిస్‌ప్లే, 200MP కెమెరా, కొత్త డిజైన్‌తో రాబోతున్న ఫోల్డబుల్స్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు