HomeAndhra PradeshAP Liquor: ఏపీలో లిక్కర్ సిత్రాలు.. ధర్మవరంలో మంత్రి సన్నిహితుడికి 5 షాపులు!

AP Liquor: ఏపీలో లిక్కర్ సిత్రాలు.. ధర్మవరంలో మంత్రి సన్నిహితుడికి 5 షాపులు!

AP Liquor: ఏపీలో లిక్కర్ షాపులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో లాటరీ పద్ధతి ద్వారా షాపుల కేటాయింపు ఇవాళ పూర్తయింది. మొత్తం 3,396 షాపులకు లాటరీ ప్రక్రియ ముగిసింది. డ్రాలో విజేతలకు లైసెన్స్ ను (AP Liquor) అధికారులు ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. చాలా చోట్ల జాతరను తలపించేలా లాటరీ ప్రక్రియ కొనసాగింది. అధికార పార్టీకి చెందిన నాయకులే మెజార్టీ షాపులు (AP Liquor) దక్కించుకోవడం గమనార్హం.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నాయకుడు ఒక్కడే 5 షాపులు దక్కించుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. ధర్మవరంలో ఐదు మద్యం షాపులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఈయన మంత్రి సత్యకుమార్ సన్నిహితుడిగా చెబుతున్నారు. సందిరెడ్డి శ్రీనివాస్ కు ఐదు మద్యం షాపులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారుల లాటరీపై మద్యం వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఏలూరులో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులపై చింతమనేని అనుచరుల దాడికి ప్రయత్నించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి పోలీసులు అనుమతించలేదు. పోలీసులను దాటుకుని లోనికి దౌర్జన్యంగా వెళ్లేందుకు చింతమనేని అనుచరులు ప్రయత్నించారు. తీవ్రవాగ్వాదం చేశారు. చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దుర్భాషలాడి, దాడికి యత్నించారు. చలసాని గార్డెన్ లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ నిర్వహించారు.

యూపీ, కర్ణాటక వాసులకు దక్కిన షాపులు
కృష్ణాజిల్లాలో మద్యం షాపుల లాటరీకి సంబంధించి వేరే రాష్ట్రాల వ్యక్తులకు జాక్ పాట్ తగిలింది. లాటరీలో మద్యం షాపులను ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు దక్కించుకున్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ నెంబర్ షాప్ ను కర్ణాటకకు చెందిన మహేష్ బాతే కైవసం చేసుకున్నారు. అలాగే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ నెంబర్ షాప్ ను ఉత్తరప్రదేశ్ కి చెందిన లోకేష్ చంద్ దక్కించుకున్నారు. కృష్ణాజిల్లాలో 123 షాపులకు 2,942 దరఖాస్తులు రాగా, అత్యధికంగా తాడిగడపలోని 117 నెంబర్ షాపుకు 57 దరఖాస్తులు అందాయి. హిందూ కాలేజ్ లో లాటరీ ప్రక్రియ కొనసాగింది.

విశాఖలో ఒకే వ్యక్తి 155 దరఖాస్తులు
విశాఖపట్నంలో ఓ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాడు. మద్యం దుకాణాలు లాటరీలో 155 షాపులకు గానూ 155 అప్లికేషన్లను అగర్వాల్ అనే వ్యక్తి వేశాడు.

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 113 షాపులకు 5,825 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 39 షాప్ లకు 1,932 మంది దరఖాస్తు చేసుకున్నారు. మైలవరం సర్కిల్ లోని 10 షాప్ లకు 493 దరఖాస్తులు చేశారు. నందిగామ సర్కిల్ లోని 16 షాప్ లకు 908 అప్లికేషన్లు వచ్చాయి. వత్సవాయి మండలంలోని 96వ నెంబర్ షాపుకు అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 133 షాపులకు లాటరీ పద్ధతిలో ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు జరిగింది.133 షాపులకు గాను 4087 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్లో ఉన్న గోదావరి భవన్లో లాటరీ ప్రక్రియ జరిగింది. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇవాళ లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు జిల్లాలో ఉన్న125 మద్యం దుకాణాలు కేటాయించారు. 125 మద్యం దుకాణాలకు 4,384 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.87 కోట్ల ఆదాయం చేకూరింది.

కాకినాడ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ స్పందన హల్ లో మద్యం షాపుల లైసెన్స్ కు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 155 షాప్ లకు 3,382 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వానికి రూ.66.64 కోట్లు ఆదాయం చేకూరింది.

విశాఖపట్నం జిల్లాకు సంబంధించి లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు చేశారు. విశాఖలో 155 మద్యం దుకాణాలకు గానూ 4,139 దరఖాస్తులు అందాయి.

తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం మద్యం సిండికేట్ కారణంగా భారీగా దరఖాస్తులు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా 227 మద్యం షాపులకు కేవలం 3,659 దరఖాస్తులు వచ్చాయి. రూ.73.18 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుచానూరు రోడ్ శిల్పారామం ఫంక్షన్ హాల్ లో లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గం వి.కోటలో మద్యం సిండికేట్ దారులు బెదిరింపులకు దిగారు. వి.కోటలో మద్యం దుకాణాలకు ఎలా అప్లికేషన్ వేస్తారని టిడిపి నేత, మద్యం సిండికేట్ సభ్యుడు పోన్ లో బెదిరింపులకు దిగాడు. ఇద్దరు టిడిపి నాయకులు మధ్య మద్యం షాపు టెండర్ వార్ నడిచింది. బంగారుపాలెం – వీకోట టీడీపీ నాయకుల సెల్ ఫోన్ సంభాషణ వైరల్ అయ్యింది.

ఇవీ చదవండి: Liquor: బీరు, వైన్, విస్కీ, బ్రాందీ.. బరువును ఎలా పెంచుతాయంటే..
AP Liquor: ఏపీలో మందుబాబులకు అప్ డేట్.. విదేశీ మద్యంపై సర్కార్ కీలక నిర్ణయం!
AP Liquor: వైన్ షాపుల దరఖాస్తుల్లో ఎక్సైజ్ అధికారులకూ..
CBN on Liquor Syndicate: లిక్కర్ సిండికేట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే..
AP Liquor Policy: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త మద్యం షాపులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు