Tirumala Samacharam 06-09-2023: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏపీలో ఓ వైపు వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోనూ వర్షం కురుస్తోంది. మరోవైపు భక్తుల రద్దీ కూడా తగ్గడం లేదు. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,964 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. (Tirumala Samacharam 06-09-2023)
నేడు భక్తులకు కర్రల పంపిణీ
తిరుమల నడక దారిలో ఇటీవల లక్షిత అనే చిన్నారిని చిరుత పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అనంతరం టీటీడీ అధికారులు భక్తుల రక్షణపై చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భక్తులకు నడక దారిలో కర్రలు పంపిణీ చేయానలి నిర్ణయించారు. అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి భక్తుల చేతికి టీటీడీ కర్రలు అందజేయనుంది.
ఇదీ చదవండి: Microorganisms: సూక్ష్మజీవుల్లో మంచివి ఏవి? చెడ్డవి ఏవి? తప్పక తెలుసుకోండి!