Devotional Tip: అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు ప్రస్తుతం సమాజంలో కోకొల్లలు ఉన్నారు. వాటి నుంచి బయట పడే మార్గం కోసం అన్వేషణ కొనసాగిస్తుంటారు. ఎంత కష్టపడినా చేసిన అప్పులు తీర్చలేక సతమతం అవుతుంటారు. ఈ నేపథ్యంలో జీవితంలో కష్టపడుతూనే దైవారాధనలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యాపారాభివృద్ధికి కూడా కొన్ని ఆధ్యాత్మిక చిట్కాలు పాటించడం వల్ల సకల శుభప్రదంగా ఉంటుందంటున్నారు. అందులో ఒకటి శ్రీనివాస ఐశ్వర్య మంత్రం. ప్రాచీన కాలం నుంచే ఈ మంత్రానికి విశేష ప్రాధాన్యం ఉందని పెద్దలు చెబుతున్నారు. (Devotional Tip)
ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి, ఐశ్వర్యపరమైన ఇబ్బందులు, అప్పులు ఇచ్చిన వారికి వెనక్కి రాకపోవడం, కోర్టు కేసుల్లో ఇబ్బందులు.. ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రాన్ని చదువుకోవడం వల్ల విశేష ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. రాసుకొని చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు.
ఎలా రాసుకోవాలి?
ఎర్ర సిరా పెన్ను తీసుకోవాలి. గీతలు లేని తెల్ల కాగితం తీసుకొని నాలుగువైపులా పసుపు, గంధం పూసిన బొట్టు పెట్టుకోవాలి. అదే గంధంతో మధ్యలో శ్రీ అనే అక్షరం రాయాలి.
శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహా మంత్రం
శ్రీ వత్స వక్షసం
శ్రీ శం
శ్రీ లోలం
శ్రీ కరగ్రహమ్
శ్రీ మంతం
శ్రీనిధిమ్
శ్రీఢ్యం
శ్రీనివాసం
భజేనిశం !
ఇందులో అష్ట శ్రీలు ఉంటాయి. 8 శ్రీల ప్రత్యేకత పురాణ కాలం నుంచే పెద్దలు చెప్పారు. శంకరాచార్యుల వారు స్వయంగా తిరుమల స్వామివారి ఆనంద నిలయంలో శ్రీచక్రాన్ని, ఆకర్షణ ధన యంత్రాన్ని అక్కడ ప్రతిష్టించిన తర్వాత శ్రీవారికి ఎదురుగుండా పైన ఉన్నటువంటి తోరణం మీద ఆరోజుల్లో శిష్యులందరికీ శిలాఫలకం మీద రాయించారని పెద్దలు చెబుతున్నారు. అంతటి విశేషం కలిగిన ఐశ్వర్య మహామంత్రం. ఈ మంత్రం ద్వారా, ఆకర్షణ యంత్రం ద్వారానే తిరుమలకు అంతటి ప్రాశస్త్యం వచ్చిందని పెద్దలు చెబుతారు.
ఈ శ్లోకాన్ని నిరంతరం తెల్ల పేపర్‌పై రోజూ ఒక సమయానికి ప్రారంభించి రాసుకోవాలి. ఈరోజు నుంచి 28 సార్లు రాద్దామని అనుకుంటే మీ కోరిక నెరవేరే దాకా రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ రాసి రేపు సమయం కుదరలేదని రాయకపోవం లాంటివి చేయవద్దని సూచిస్తున్నారు. ఇలా కొన్నాళ్ల పాటు రాసుకోవడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, వ్యాపారాభివృద్ధికి ఎదురవుతున్న అవరోధాలు అన్నీ తొలగిపోతాయంటున్నారు.
రాసుకున్న తర్వాత కోరికలు తీరాక ఈ పేపర్‌ను ప్రతి సంవత్సరం వచ్చే భోగి పండుగ నాడు భోగి మంటల్లో వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అగ్నికి ఆహుతి ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందంటున్నారు. ఎవరైనా హోమాలు చేస్తుంటే అందులో సమర్పించవచ్చని సూచిస్తున్నారు. ఒక రావి ఆకును ఈ పేపర్లకు చుట్టి అందులో వేయాలని చెబుతున్నారు. ఇలా చాలా సులువుగా ఇబ్బందులను తొలగించుకోవచ్చు.
Read Also : Money Tips in Astrology: అప్పుల బాధలన్నీ తీరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?