Tirumala News 20-09-2023: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి తగ్గింది. టోకెన్ లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,267 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు చేకూరిందని టీటీడీ వెల్లడించింది. (Tirumala News 20-09-2023)
నేడు మూడో రోజు శ్రీవారీ వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ మూడో రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ. సింహ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరిలో శ్రీదేవి, భూదేవి సమేతుడై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వీనులవిందుగా ఆ బ్రహ్మాండ నాయకుడిని భక్తులు దర్శించుకొని పులకించిపోతున్నారు.
తిరుమలలో 6 వ చిరుతను పట్టుకున్నాం
తిరుమలలో 6 వ చిరుతను పట్టుకున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల భద్రతే ప్రామాణికంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఊత కర్రలతో పాటు బోనులు ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకుంటున్నట్లు వెల్లడించారు. విమర్శిస్తే వచ్చేది కేవలం ఆత్మ సంతృప్తి మాత్రమేనని ఆయన చురకలంటించారు. చిరుతలు పట్టుకునే చర్యలు నిరంతరంగా సాగుతుందని స్పష్టం చేశారు.
చిరుతను అటవీ శాఖ సిబ్బంది బంధించారని భూమన తెలిపారు. నడకదారిలో బోన్ లో చిరుత చిక్కిందన్నారు. వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించిందని తెలిపారు. చిన్నారి లక్షిత పై దాడి చేసి, హతమార్చిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కిందని పేర్కొన్నారు. చిరుతను జూ పార్క్ కు తరలించడానికి అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు 6 చిరుతలు అటవీ శాఖ అధికారులు బంధించారు.
Global Tigers Day: ఎస్వీ జూ పార్కులో గ్లోబల్ టైగర్స్ డే వేడుకలు