HomeAndhra PradeshTirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఈవో ధర్మారెడ్డి

Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఈవో ధర్మారెడ్డి

Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాంట్రవర్సీ కామెంట్స్‌ చేయడంతో ఈ వివాదం వెలుగు చూసింది. నందిని బ్రాండ్ ను టీటీడీ నిరాకరించిందంటూ కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ కామెంట్‌ చేశారు. కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ కామెంట్స్‌పై శ్రీవారి భక్తులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Read Also : Tirumala News 02-08-2023: తిరుమలలో 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటలు

భీమా నాయక్ వ్యాఖ్యలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఖండించారు. 20 సంవత్సరాల పాటు టీటీడీకి నందిని బ్రాండ్‌ నెయ్యిని సరఫరా చేసిందని గుర్తు చేశారు. నందిని పాల ఉత్పత్తులను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2021 టెండర్ల లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల్గొనలేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ టెండర్ల ద్వారా నెయ్యిని టీటీడీ కొనుగోలు చేస్తోంది. భీమా నాయక్ ఆరోపణలు అవాస్తవం అని ఈవో ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. లడ్డూ ప్రసాదానికి, నందిని నెయ్యికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Read Also : Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు