Tirumala Samacharam 12-08-2023: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేసింది. మృతిచెందిన బాలిక లక్షిత(6)గా గుర్తించారు. కాలినడకన వెళ్తుండగా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 8 గంటలకు తిరుమలకు ఓ కుటుంబం కాలినడకన బయల్దేరింది. (Tirumala Samacharam 12-08-2023)
రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆ కుటుంబం చేరుకుంది. ఆలయం వద్ద నడిచి వెళ్తున్న బాలికను చిరుత లాక్కెళ్లింది. చిరుత లాక్కెళ్లిన ఘటనపై భద్రతా సిబ్బందికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా నుంచి ఆ కుటుంబం వచ్చింది.
జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం నుంచి తిరుమల దినేష్, శశికళ కుటుంబం వచ్చింది. చిన్నారిని లాక్కెళ్లిన చిరుత చంపేసింది. ఉదయం నరసింహస్వామి ఆలయం దగ్గర చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి శరీరం పై తీవ్రగాయాలు కనిపించాయి. నెల క్రితం ఐదేళ్ల బాలుడి పై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో బాలుడు గాయాలతో బయటపడ్డాడు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 23 కంపార్ట్ మెంట్ల లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,158 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు చేకూరింది. శ్రీవారికి నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,735 మంది.
నేడు శుద్ధ తిరుమల – సుందర తిరుమల కార్యక్రమం
నేడు శుద్ధ తిరుమల-సుందర తిరుమల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలిపిరి వద్ద జెండా ఊపి ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో 800 మంది ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also : Credits pain: అప్పుల బాధలు పోవాలంటే.. మంచి పరిష్కార మార్గం ఇదే!