Microorganisms: సూక్ష్మజీవులు అనగానే మనకు అనారోగ్యం కలిగించేవి అనే భావన ఉంటుంది. కానీ.. శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో రకాలుగా ఆహార పదార్థాల ద్వారా దొరుకుతాయి. ఆహారం ద్వారా శరీరంలోకి హానికరమైన సూక్ష్మజీవులు వెళ్లినా… వాటిని మంచి సూక్ష్మజీవులు నశింపచేస్తాయి. ఇవి జీర్ణకోశంలో ఉంటాయి. ఆహారం ద్వారా కూడా మేలు చేసే సూక్ష్మజీవుల్ని స్వీకరించవచ్చు. పులియపెట్టిన ఆహార పదార్థాల్లో ప్రోబ్యాక్టీరియా ఉంటుంది. ఉదాహరణకు పెరుగు, మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ బాసిల్లై. బ్రెడ్ తయారీ కోసం గోధుమ పిండిలో ఈస్ట్ కలుపుతారు. ఇవి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. (Microorganisms)
జీర్ణక్రియ సవ్యంగా సాగాలంటే ప్రోబయోటిక్స్ చాలా కీలకం. ప్రోబయోటిక్స్ అందించే ఆహారంలో పెరుగు, మజ్జిగ చాలా ముఖ్యమైనవి. ప్రోబయోటిక్స్ ఉన్న పదార్థాలు ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండటంతో పాటు మలబద్ధకాన్ని, విరేచనాల్ని కూడా నివారిస్తుంది. ప్రోబయోటిక్స్‌తో లాభాలు చాలా ఉన్నాయి.
మనిషికి ఆరోగ్యాన్ని అందించే ఆహారంలో ప్రో బయాటిక్స్ అనే రకం ఆహారం అతి ముఖ్యమైనది. జీర్ణశక్తికి మేలు చేసే బ్యాక్టీరియా కలిగిన ఆహారాన్ని ప్రోబయోటిక్స్ అంటారు. ప్రోబయోటిక్స్ సప్లిమెంట్స్ రూపంలో లభిస్తున్నప్పటికీ ఆహారం ద్వారా తీసుకోవడం ఉత్తమం. ప్రోబయోటిక్స్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.
మంచి బ్యాక్టీరియా సాధారణ ఆరోగ్యాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా రక్తపోటును కూడా క్రమబద్దీకరిస్తుంది. ప్రోబయోటిక్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెడు బ్యాక్టీరియా అనారోగ్యానికి గురి చేసినప్పుడు ప్రోబ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని అప్రమత్తం చేస్తుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది.
సాధారణంగా ప్రోబయోటిక్స్ పదార్థాల్లో మరింత మేలు కలిగింతే సూక్ష్మజీవుల్ని పెరిగేలా చేయవచ్చు. ఇలా చేసిన పదార్థాలు మార్కెట్లో లభిస్తుంటాయి. ఈ ఆహార పదార్థాల ద్వారా ప్రోబయోటిక్స్‌ను తీసుకోవాలి అనుకుంటే వాటిపై లేబుల్స్‌ను ముందుగానే పరీక్షించుకోవాలి. ఆ పదార్థాల్లో ప్రోబయోటిక్స్ ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. బయట ప్యాకింగ్ ద్వారా లభించే ప్రోబయోటిక్ ఆహారం తీసుకోవాలని అనుకునే వాళ్లు.. ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: Wrong Food Combinations: రాంగ్ ఫుడ్ కాంబినేషన్లు తెలుసా? ఇలా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందట..