HomeAndhra PradeshRepublic day at Amaravati : అమరావతిలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

Republic day at Amaravati : అమరావతిలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

Republic day at Amaravati : రాష్ట్ర స్థాయి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని అమరావతి నేలపాడులో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాష్ట్ర ఐక్యత, ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా సాగాయి.

ఈ సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, కవాతును పరిశీలించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు.

ఆకట్టుకున్న ఘన కవాతు
గణతంత్ర వేడుకల్లో ఇండియన్ ఆర్మీ, కర్నూలు ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, కేరళ రాష్ట్ర పోలీస్, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌తో పాటు ఎన్సీసీ (బాయ్స్, గర్ల్స్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్లు కవాతు నిర్వహించి ఆహుతులను అలరించాయి.

కవాతులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన
ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ కు ప్రథమ స్థానం,
విశాఖపట్టణం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కు ద్వితీయ స్థానం,
కేరళ రాష్ట్ర పోలీస్ కంటింజెంట్ కు కన్సోలేషన్ ప్రైజ్ అందజేశారు.
బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ ప్రదర్శనలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.

అధికారుల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు
పెరేడ్ నిర్వహణకు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ బీ. రాజకుమారి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించగా, డీఐజీ డా. కె. ఫకీరప్ప కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పెరేడ్ కమాండర్‌గా జంగారెడ్డి గూడెం ఏఎస్పీ ఆర్. సుస్మిత, సెకండ్ ఇన్ కమాండ్‌గా ఏపీఎస్పీ ఫస్ట్ ఐఆర్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ టీ.ఎన్. శ్రీనివాసరావు, అడ్జుటెంట్‌గా కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ఎం. శివరామకృష్ణ వ్యవహరించారు.

ప్రముఖుల హాజరు
ఈ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దంపతులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా అలంకృత శకటాలు
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన అలంకృత శకటాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సామాజిక అవగాహన, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిన శకటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

శకటాల పోటీలో
వందేమాతరం – 150 సంవత్సరాలు ఇతివృత్తంతో రూపొందిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ స్థానం,
మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం అనే అంశంతో రూపొందిన సెర్ప్ శకటానికి ద్వితీయ స్థానం,
పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇతివృత్తంతో రూపొందిన పరిశ్రమల శాఖ శకటానికి తృతీయ స్థానం దక్కాయి.
ఇవే కాకుండా జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య–కుటుంబ సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, పాఠశాల విద్య, పర్యాటకం, జల భద్రత, అటవీ, వ్యవసాయం–అగ్రి టెక్, మత్స్య, మౌలిక వసతులు, ఇంధనం, చేనేత, స్వచ్ఛ ఆంధ్ర, పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్ తదితర శాఖల శకటాలు ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి.

ఆధునిక సాంకేతికతతో పాటు సంప్రదాయ కళారూపాల మేళవింపుతో రూపొందిన ఈ శకటాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అమరావతి రాజధానిలో నిర్వహించిన ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను చాటుతూ విజయవంతంగా ముగిశాయి.

ఇవీ చదవండి: Arnab Goswamy : అర్నబ్ దెబ్బకు బెంబేలు.. రిపబ్లిక్ టీవీని బాయ్‌కాట్ చేసిన టీడీపీ!
Independence Day: What is Independence Day? గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకొంటాం?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు