Arnab Goswamy : ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సర్వత్రా కార్నర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వరుసగా పరిణామాలు టీడీపీకి, ఏపీ మంత్రి నారా లోకేష్ కు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రామ్మోహన్ నాయుడుకు వ్యతిరేకంగా మారాయి.
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, రిపబ్లిక్ టీవీలో జరిగిన హై-వోల్టేజ్ డిబేట్‌లో ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభంలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (TDP)పై అర్నబ్ గోస్వామి ప్రశ్నల దాడి చేశారు. లక్షలాది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న ఈ సమస్యలో TDP పార్టీ ‘పరాన్నధారీ’గా మారి, మంత్రుల అధికారాన్ని దెబ్బతీస్తోందని అర్నబ్ ఆరోపించారు. ఈ డిబేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో TDPలో అంతర్గత విమర్శలు ఎగసిపడ్డాయి.
ఇండిగో సంక్షోభం
గత వారంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో భారీ అంగీకారాలు, విమానాల రద్దులు జరిగాయి. కొత్త FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నియమాలు అమలు తీర్మానంతో జాబితా సమస్యలు తలెత్తాయి. దీంతో దేశవ్యాప్తంగా 470కి పైగా విమానాలు రద్దు చేశారు. టికెట్ ధరలు రూ.80,000 వరకు పెరిగాయి. మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీలో TDP ప్రతినిధి డీపక్ రెడ్డి పాల్గొన్న డిబేట్‌లో అర్నబ్ గోస్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అర్నబ్ గోస్వామి వ్యాఖ్యలు
డిబేట్‌లో డీపక్ రెడ్డి, “నారా లోకేష్ తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు, ఎమర్జెన్సీ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశాము” అని చెప్పగానే అర్నబ్ గోస్వామికి చిర్రెత్తుకొచ్చింది. “నారా లోకేష్ ఎవరు? పౌర విమానయాన శాఖకు అతనికి ఏమి సంబంధం? ఏ సామర్థ్యంతో ఈ సంక్షోభాన్ని మానిటర్ చేస్తున్నారు? ఇది సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంటా? లేక TDP డిపార్ట్‌మెంటా?” అని ప్రశ్నించారు. “ఒక రాష్ట్ర మంత్రి దేశీయ విమానయాన సమస్యలో ఎలా జోక్యం చేసుకోగలరు? TDP పార్టీకి ఇక్కడ ఏమి పని? ఇది కేంద్ర ప్రభుత్వ విషయం, TDP మంత్రిత్వ శాఖ కాదు.” అని అర్నబ్ మండిపడ్డాడు. ఈ వ్యాఖ్యలు TDP ప్రతినిధిని ఇరకాటంలో పడేశాయి. టీడీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని, లోకేష్ అన్నింటా జోక్యం చేసుకుంటున్నాడంటూ అర్నబ్ తీవ్రంగా ఆరోపణలు గుప్పించాడు. ఈ డిబేట్ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. TDPలో అంతర్గతంగా లోకేష్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందన్న చర్చ జరిగింది.
టార్గెట్ రామ్మోహన్ నాయుడు
“పప్పెట్ మంత్రి?” అంటూ అర్నబ్ వ్యాఖ్యలు రామ్మోహన్ నాయుడును లక్ష్యంగా చేశాయి. TDP ప్రతినిధి లోకేష్ ‘మానిటరింగ్’ చేస్తున్నారని చెప్పడంతో, “రామ్మోహన్ నాయుడు కేవలం పప్పెట్ మంత్రి కాబట్టి, నిజమైన అధికారం లోకేష్ వద్దే ఉంది” అనే అర్థం వచ్చిందని అర్నబ్ సూచించారు. “ఇండిగో బ్లాక్‌మెయిల్‌కు కేంద్రం లొంగిపోతోంది, ప్రయాణికుల భద్రతను రాజీ చేసుకుంటోంది” అని అర్నబ్ విమర్శించారు. రామ్మోహన్ నాయుడు అత్యంత ఆలస్యంగా చర్యలు తీసుకున్నారని, FDTL నియమాల అమలులో ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.
ప్రయాణికులు సోషల్ మీడియాలో రామ్మోహన్ నాయుడు రాజీనామా కావాలని డిమాండ్ చేశారు. YSRCP నాయకులు.. రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యాడని, అహ్మదాబాద్ ప్రమాద స్థలంలో రీల్స్ చేస్తూ తిరిగారు కానీ సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అయితే, టీడీపీ మాత్రం మంత్రికి మద్దతుగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపింది. పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి పెమ్మసాని సహా టీడీపీ సీనియర్ నేతలతో ట్వీట్లు పెట్టించారు.
ఈ ఉదంతం టీడీపీలో అంతర్గత ఉద్రిక్తతలకు దారితీసింది. అర్నబ్ గోస్వామి డిబేట్‌లు తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇవాళ సాయంత్రం జరిగిన డిబేట్లో అర్నబ్ ఖాళీ కూర్చీని చూపుతూ, టీడీపీ తరఫున ప్రతినిధి హాజరు కాలేదని చెప్పారు. తాను ఘాటుగా ప్రశ్నలు అడుగుతున్నందున టీడీపీ ఇబ్బంది పడుతోందని, అందుకే రిపబ్లిక్ టీవీని టీడీపీ బాయ్ కాట్ చేసిందన్నారు. తాను ఎవరిని బ్లేమ్ చేయాలని ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ ను బ్లేమ్ చేయాలా? అని క్వశ్చన్ చేశారు.
మొత్తానికి అర్నబ్ గోస్వామి దెబ్బకు టీడీపీ పరువు పోయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పెత్తనం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు డమ్మీలుగా మారారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: Lokesh with Modi : ప్రధానితో లోకేష్ భేటీ.. కీలక బాధ్యతలు, అరెస్టుల గురించేనా?
Jagan press meet: జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. పవన్, చంద్రబాబు, లోకేష్‌పై కీలక వ్యాఖ్యలు
New York: న్యూయార్క్ లో లోకేష్.. విట్ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ
