Esha Rebba : తెలుగు సినీప్రియులకు సుపరిచితమైన హీరోయిన్ ఈషా రెబ్బా అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ… ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అయితే సినిమాల కంటే భిన్నమైన పాత్రలతో ఓటీటీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న ఈ అమ్మడు, ఇప్పుడు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ జయ జయహే సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 30న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.
డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన ఈషా
ఇదిలా ఉండగా… తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఈషాను ఈ రూమర్స్ గురించి ప్రశ్నించగా… తనదైన స్టైల్లో స్పందించింది.
“ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండటం మంచిదే. కానీ దేనిపైనా ఇప్పుడే క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. నిజంగా ఏదైనా ఉంటే… నేనే ముందుగా అందరికీ చెబుతాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె రూమర్స్‌ను పూర్తిగా ఖండించకపోవడం, అంగీకరించకపోవడంతో… ‘ఏదో ఉందేమో’ అంటూ నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు.
షాకింగ్ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
అలాగే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కూడా ఈషా బయటపెట్టింది.
ఒక సన్నివేశంలో చట్నీ తన చెంపకు అంటాల్సి ఉండగా… ఆ సీన్ రియలిస్టిక్‌గా రావాలన్న ఉద్దేశంతో దర్శకుడు చెప్పడంతో తరుణ్ భాస్కర్ తనను నిజంగానే గట్టిగా కొట్టాడని ఈషా వెల్లడించింది.
“అది యాక్టింగ్ అనుకున్నాను. కానీ నిజంగానే కొట్టేస్తాడని అస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా కళ్లలో నుంచి నీళ్లు వచ్చాయి” అంటూ నవ్వుతూ చెప్పింది.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళ ఈషా రెబ్బా వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఇవీ చదవండి: Star Heroine : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎవరో తెలుసా?
GV Prakash : జీవీ ప్రకాశ్ సిస్టమ్ స్టార్ హీరోయిన్ అని మీలో ఎంత మందికి తెలుసు?
Tollywood : తొలి టాలీవుడ్ ఆడిషన్ అనుభవాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్ అనశ్వర రాజన్
