Krishna Crime News: కృష్ణా జిల్లాలో ఓ యువతి వినూత్న రీతిలో నిరసన తెలిపింది. చెవి దుద్దులు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ వాపోయింది. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో మీకోసం గ్రీవెన్స్ లో అధికారుల వద్ద భువనేశ్వరి అనే యువతి (Krishna Crime News) వేడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
16 ఏళ్ల క్రితం భువనేశ్వరి తాత స్థలాన్ని బంధువులు అక్రమంగా అమ్మేశారని తెలిపింది. 16 ఏళ్లుగా కోర్టులో పోరాడి భువనేశ్వరి తాత కేసు గెలిచారు. కోర్టులో కేసు ఉండగానే ఆ స్థలంలో జనసేన నేతలు కాట్రగడ్డ కేశవ, యరపతి అయ్యప్ప ఇల్లు కట్టేశారు. హౌస్ ట్యాక్స్ లేకపోయినా వాటర్ కనెక్షన్ ను అధికారులు ఇచ్చారని బాధితురాలు తెలిపింది.
జనసేన నేతలు కాట్రగడ్డ కేశవ్, యరపతి అయ్యప్పకే గ్రామ పెద్దలు అండగా నిలిచారని తెలిపింది. భువనేశ్వరిని కేశవ, అయ్యప్ప కలిసి ఇబ్బంది పెడుతున్నారని తెలిపింది. నువ్వు ఆడపిల్లవి… నీ తాత ముసలోడు… మమ్మల్నేం చేయలేరంటూ జనసేన నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని వాపోయింది.
మాకు ఎంపీ , ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. గ్రౌండ్ లెవల్ ఎండార్స్ మెంట్ ఇవ్వాలంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించడం లేదని భువనేశ్వరి తెలిపింది. డబ్బులిస్తే కానీ రాజకీయ నాయకులు పనిచేయడం లేదంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద డబ్బులు లేకపోవడంతో గ్రీవెన్స్ లో అధికారుల ముందు చెవి దుద్దులు ఉంచి న్యాయం చేయమని భువనేశ్వరి కోరడం చూపరులను కంటతడి పెట్టించింది. భువనేశ్వరి చెవి దుద్దులు ఇవ్వడంతో ఆర్డీవో అవాక్కయ్యారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవీ చదవండి: Vizag Crime : పోలీసుల అదుపులో దిగంబర దొంగ.. దొరికితే మస్థిమితం లేదంటూ..
Vizag Crime news: నగ్న వీడియోలు చూపి.. సామూహిక అత్యాచారం
Kerala Crime news: అమ్మ పెట్టిన బిస్కెట్లే బిడ్డ ప్రాణం తీశాయి!
Cyber Crime: సైబర్ కేటుగాళ్లకు చుక్కలు చూపించాడు.. లక్షలు సేఫ్!
Telangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!
