HomeAndhra PradeshYS Jagan Help: వైయస్ జగన్.. విపక్షంలో ఉండీ ఇన్ని లక్షల సహాయమా?

YS Jagan Help: వైయస్ జగన్.. విపక్షంలో ఉండీ ఇన్ని లక్షల సహాయమా?

YS Jagan Help: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్ గురించి చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. ఆయన ఎవరికీ సాయం (YS Jagan Help) చేయరు అనేది ఆయనపై ఉన్న అపవాదు. అయితే, వాస్తవంగా జగన్ చేసిన, చేస్తున్న సాయం చాలా ఉంటోంది. కానీ ఆయన ఎక్కడా పబ్లిసిటీ చేసుకోవడం లేదు. ఈ విషయం అటు వైయస్సార్ సీపీ శ్రేణులకు, జగన్ అభిమానులకు బాధ కలిగిస్తోంది. ఎంత సహాయం చేస్తున్నా జగన్ చెప్పుకోవడం లేదని, అదే కూటమి పార్టీల నేతలు ఆవగింజంత సాయం చేసినా కొండత పబ్లిసిటీ చేసుకుంటారంటూ జగన్ అభిమానులు వాపోతున్నారు. (YS Jagan Help)

అధికారంలో ఉండి డీబీటీ ద్వారా ప్రజలకు రూ.2.73 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చిన జగన్.. విపక్షంలో ఉంటే తన పార్టీ తరఫున సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ అన్యాయాలకు బలైపోయిన తన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు, సోషల్ మీడియా కేసుల బారిన పడి జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వారికి జగన్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. చాలా మంది బాధితులకు ప్రతి నెలా ఖర్చులకు జగన్ చెల్లిస్తున్నారన్న విషయం లోకానికి తెలియనివ్వడం లేదు. ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి కుటుంబాలకూ లక్షలాది రూపాయలు వైయస్సార్ సీపీ తరఫున సహాయం అందిస్తున్నారు. కానీ అది ఆరోజు వరకే పత్రికల్లో చిన్న వార్త వచ్చి సరిపెట్టుకుంటోంది. ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేవడం లేదు. ఈ విషయంలో జగన్ బాగా వెనుకబడ్డారు.

రాష్ట్రంలో ప్రభుత్వవం మారినప్పటి నుంచి ఈ ఏడాది కాలంలో బాధిత, పీడిత వర్గాలకు వైయస్ జగన్ తన సొంత డబ్బు, పార్టీ తరఫున ఇచ్చిన ఘటనలు ఇవీ…

08.07.2024
గుంటూరు ముత్యాలరెడ్డి నగర్, సుగాలి కాలనీ, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాలకు చెందిన వైయస్సార్ సీపీ నాయకులు రాకేష్ నాయక్, ఆర్.అంజిబాబు, వి.శకుంతలబాబు, ప్రకాశ్ రెడ్డిలపై టీడీపీ శ్రేణులు దాడి చేసి గాయపర్చాయి. వీరికి వైయస్ జగన్ ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో పార్టీ నేతల ద్వారా అందించారు.

09.07.2024
ఎన్నికల ఫలితాల అనంతరం వైయస్సార్ సీపీకి చెందిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. గుంటూరు జిల్లా యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో గాయపడిన బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. యడ్లపాడు మండలంలోని కారుచోలకి చెందిన పార్టీ కార్యకర్తలు మద్దూరి పౌలు, తలకోటి దావీదు, నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన పార్టీ నేతలు చావా నరసింహారావు, గారా భాస్కరరావు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చెక్కును అందించారు. అలాగే టీడీపీ దాడిలో ఫిరంగిపురంలోని శాంతిపేటకు చెందిన యువకులు సాయి, సాగర్ బాబు గాయపడ్డారు. వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందించారు. తుళ్లూరు మండలం వడ్డమానులో టీడీపీ కార్యకర్తలు గాయపరిచిన వైయస్సార్ సీపీ కార్యకర్త కార్యంశెట్టి వెంకటరావుకు రూ.50 వేల చెక్కును వైయస్ జగన్ తరఫున పార్టీ నేతలు అందించారు.

09.09.2024
విశాఖపట్నంలోని అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడి, మరణించిన నీలాపు రామిరెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ తన పార్టీ తరఫున రూ.5 లక్షల సహాయం అందజేశారు. చెక్కును పార్టీ నాయకులు మొల్లి అప్పారావు, గేదెల నాగరాజు అందించారు. ఈ ప్రమాదంలో మరణించిన 18 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున జగన్ సహాయం చేశారు. అలాగే గాయపడిన వారికి రూ.1 లక్ష పార్టీ తరఫున అందించారు.

02.11.2024
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబానికి వైయస్ జగన్ అండగా నిలిచారు. పార్టీ తరఫున రూ.1.1 లక్షల చెక్కును పార్టీ నేతల ద్వారా అందించారు.

02.11.2024
శ్రీకాకుళం జిల్లా పలాసలో లైంగిక దాడికి గురైన ఇద్దరు అక్కచెల్లెళ్లకు వైయస్ జగన్ రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు చెక్కును మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్ బాధిత కుటుంబానికి అందజేశారు.

03.11.2024
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్తముచ్చుమర్రిలో జూలై 7న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా చంపేసి మృతదేహాన్ని కూడా మాయం చేసిన ఘటన జరిగింది. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి వైయస్ జగన్ బాసటగా నిలిచారు. రూ.10 లక్షల చెక్కును పార్టీ నేతల ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు.

05.11.2024
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నల్లబొమ్మనపల్లి వద్ద అత్తా కోడలిపై సామూహిక అత్యాచారం జరిగితే.. వైయస్సార్ సీపీ తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం వైయస్ జగన్ చేశారు. మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ బాధిత కుటుంబానికి చెక్కు అందించారు.

23.11.2024
జూన్ లో బాపట్ల జిల్లా, ఈపూరుపాలేనికి చెందిన యువతి (21)పై లైంగిక దాడి చేసి ఆమెను దారుణంగా చంపేసిన ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటనను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఆ పార్టీ నేతలు.. ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు జగన్ పంపిన రూ.10 లక్షల చెక్కును పార్టీ నేతలు బాధిత కుటుంబానికి అందజేశారు.

26.11.2024
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బారిన పడి 13 మంది చనిపోతే వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున వైయస్ జగన్ చెక్కులు అందించారు. పార్టీ సీనియర్ నేత బొత్స బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు.

01.05.2025
వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో అకాల వర్షాలకు నష్టపోయిన అరటి రైతులను జగన్ పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకున్నా ఆదుకోకపోయినా హెక్టారుకు రూ.20 వేల చొప్పున సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ద్వారా రైతులకు డీడీలు పంపిణీ చేశారు. 670 మంది రైతులకు మొత్తం రూ.1.14 కోట్ల పరిహారాన్ని డీడీల రూపంలో అందజేశారు.

07.05.2025
సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు వైయస్సార్ సీపీ తరఫున రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.

16.05.2025
శ్రీ సత్యసాయి జిల్లాలో వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైయస్ జగన్ రూ.25 లక్షల సహాయం ప్రకటించారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆ కుటుంబాన్ని కలిసి చెక్కు అందజేశారు.

  • 2025 ఫిబ్రవరి 26న పులివెందులలో వైయస్ రాజారెడ్డి కంటి ఆస్పత్రిని జగన్ ప్రారంభించారు. రూ.10 కోట్లతో దీన్ని ఆధునీకరించారు.
  • బద్వేలులో ప్రేమోన్మాది దాడిలో బలైపోయిన యువతి కుటుంబానికి వైయస్ జగన్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయం చేశారు. 2024 అక్టోబర్ 19 మైనర్ బాలికపైన అత్యంత పాశవికంగా దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబానికి వైయస్ జగన్ రూ.10 లక్షల సహాయం ప్రకటించి ఆ నెలాఖరులోనే బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా చేతుల మీదుగా చెక్కు అందేలా చేశారు.
  • తనకు ఇల్లు మంజూరైనందుకు ఆనందం పంచుకున్న గీతాంజలిపై టీడీపీ, జనసేన శ్రేణులు ట్రోలింగ్ కు పాల్పడగా మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎంగా ఉండగానే జగన్ రూ.20 లక్షల సహాయం ప్రకటించి అందించారు. అలాగే గీతాంజలి కుటుంబానికి వైయస్సార్ సీపీ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో రూ.50 వేల సహాయం 16.04.2025న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అందజేశారు.
  • విజయవాడలో వరదలు ముంచెత్తితే వరద బాధితులకు రూ.1కోటి సహాయం చేశారు. వరద బాధితులకు అవసరమైన వస్తువులు, వాటర్ బాటిళ్లు, ఆహారం, నిత్యావసరాలు సహాయం చేశారు. పార్టీ శ్రేణుల ద్వారా సహాయ కార్యక్రమాలు అందేలా చేశారు.
  • పులివెందులలోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నాణ్యమైన విద్య ఫ్రీగా అందిస్తున్నారు. ఎంతో మంది మూగ, చెవిటి పిల్లలకు ఆపరేషన్లు చేయించారు.
  • పాదయాత్రలో గానీ, ఓదార్పు యాత్రలో గానీ ఎంతో మంది యువకులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఉద్యోగాలకు వెళ్లేందుకు దారి చూపించారు.
  • కోవిడ్ సమయంలో మరణించిన 201 పోలీసు కుటుంబాలకు రూ.17 లక్షల ఆర్థిక సహాయం అందించినది దేశంలో వైయస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమే. అదీ ముఖ్యమంత్రిగా జగన్ చొరవతోనే.
  • ఓ డాక్టర్ కుటుంబం కోవిడ్ సమయంలో ప్రాణాపాయంలో ఉంటే జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.1కోటి సహాయం అందించింది.
  • జబర్దస్త్ కమెడియన్ ప్రసాద్ ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతుంటే అప్పటి మంత్రి రోజా ద్వారా అతనికి ఎంతో సహాయం చేశారు. అది ఇప్పటికీ ఆయన చెప్పుకుంటారు.
  • కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు, ఆస్తుల విధ్వంసాలకు గురైన వందలాది మంది కుటుంబాలను జగన్ ఆదుకున్నారు. వారికి ఆర్థిక సహాయం చేశారు.
  • ఇక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ రాష్ట్రంలో ఏ మూలన పర్యటనలు చేసినా అక్కడికి సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున అండగా నిలిచారు. వీలైనంత వేగంగా వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందజేసిన ఉదంతాలు కోకొల్లలు.

ప్రజల కోసం ఇంత చేసిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా?
ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే రూ.2.73 లక్షల కోట్లు సంక్షేమం రూపంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పేదలకు జగన్ సహాయం చేశారు. అది తన జేబులోంచి ఇస్తున్నాడా అంటూ అప్పట్లో చాలా మంది విమర్శలు చేశారు. కానీ అంతకంటే ఎక్కువగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఇస్తోందా? అంటే లేదని చెప్పక తప్పదు. అయితే, ముఖ్యమంత్రిగా లేకపోయినా, పదవిలో లేకున్నా జగన్ మాత్రం బాధితులకు అండగా నిలవడంలో తన చేతికి ఎముక లేదన్న చందంగా ప్రతి ఒక్కరికీ తోడుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఘోరాలు జరిగినా ముందుగా జగన్ స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పార్టీ తరఫున జగన్ ఆదుకుంటున్నారు. ఇలా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు రాష్ట్రంలో మరెవరైనా ఉన్నారా? అని లబ్ధిపొందిన కుటుంబాలు ఆయన్ను ఆరాధిస్తున్నాయి.

ఇవీ చదవండి: Jagan Meeting : ముఖ్యనేతలతో జగన్.. వచ్చేది మనమేనంటూ కీలక వ్యాఖ్యలు!
YS Jagan Meeting : తెగువ ఎలా ఉంటుందో చాటి చెప్పారు : వైయస్ జగన్
YS Jagan fire: నా తల్లి, చెల్లెళ్ల పేరుతో చంద్రబాబు రాక్షస రాజకీయం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు