Cyber Crime: ఇటీవలి కాలంలో ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసే సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు. అయితే వీరి బారి నుంచి అనూహ్యంగా తప్పించుకున్నాడో వ్యక్తి. సాధారణంగా సైబర్ నేరగాళ్ల బారిన పడితే జేబులు గుల్లే. కానీ ఓ సామాన్య ఉద్యోగి తప్పించుకున్నాడు. సైబర్ కేటుగాళ్లకే టోపీ పెట్టాడు. వారికి చుక్కలు చూపించాడు.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీసులో పనిచేసే ఓ చిరుద్యోగికి ఓ కొరియర్ రావాలి. తన బంధువులు కొన్నాళ్ల కిందట రాజమండ్రి నుంచి డీటీడీసీలో కొరియర్ పంపారు. అయితే, హాలిడే కావడం ఇంకా పలు కారణాలతో ఆలస్యమై పార్సిల్ త్వరగా రాలేదు. దాంతో వెంటనే ఆ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసిన నెంబర్ ద్వారా నాగేశ్వరావు తన కొరియర్ ను ట్రాకింగ్ చేశాడు. పార్సిల్ విజయవాడ లోనే డెలివరీకి వచ్చినట్టు కనిపించింది. కానీ ఇంటికి రాలేదు.
దాంతో వెబ్‌సైట్‌లో ఉన్న ఒక కాంటాక్ట్ నెంబర్ ని వెతికి వాళ్లకు ఫోన్ కొట్టాడు. హిందీలో మాట్లాడుతూ ఓ వ్యక్తి రెస్పాండ్ అయ్యాడు. తనకి హిందీ రాకపోవడంతో మరో వ్యక్తి కాల్ చేస్తాడంటూ ఫోన్ పెట్టేసిన నిమిషానికి ఇంకో కాల్ వచ్చింది. అతను హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడాలంటూ వాట్సప్ లో లింకు పెట్టాడు. అప్పటికే అనుమానం వచ్చిన నాగేశ్వరరావు, అతని మాటలు వింటూనే లింక్ క్లిక్ చేశాడు. దానికి ఓటీపీ వస్తుందని, త్వరగా చెప్పాలనడంతో ఓటీపీ చెప్పాడు. తర్వాత ఫోన్ పేలో రూ.5 పంపితే రివర్స్ పంపుతానని, ఇదంతా కన్ఫర్మేషన్ కోసమని కబుర్లు చెప్పడంతో నాగేశ్వరరావుకు అనుమానం కొడుతూనే ఉంది.
తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి వరుసగా మెసేజులు వచ్చాయి. 5 లక్షలు వాడుకున్నట్లు మెసేలు రావడంతో నాగేశ్వరరావు ఖంగారుపడి బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. సైబర్ నేరగాళ్లు తన క్రెడిట్ కార్డు హ్యాక్ చేసి డబ్బులు కొట్టేశారని ఫిర్యాదు చేశాడు. బ్యాంకు వాళ్లు చెక్ చేసి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, నాగేశ్వరరావు పేరుపై క్రెడిట్ కార్డు లోన్లు అప్లై చేసినట్లు క్లారిటీ వచ్చింది. ఈ ప్రక్రియ చేయడానికి మూడు దశల్లో ప్రతి దశలోనూ ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా కూడా నాగేశ్వరరావుతో ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు పూర్తి చేశారు.
అయితే, లోన్ కు సంబంధించిన డబ్బులు ఆ బ్యాంకులో ఉన్న అకౌంట్లోనే జమవుతాయి. అలా రూ.5 లక్షలు నాగేశ్వరరావు ఖాతాలో జమ అయ్యాయి. ఇది వెంటనే అప్డేట్ కాకపోవడంతో బ్యాంకు సిబ్బందికి ఈ విషయం తెలియలేదు. అప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలని ఆయన దరఖాస్తు చేసుకోవడం వెంటనే స్మార్ట్ ఫోన్ లో ఉన్న తన సిమ్ ను తీసేసి కీప్యాడ్ ఫోన్లో సిమ్ మార్చుకున్నాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్ హ్యాక్ చేయలేకపోయారు.
ఈలోపు బ్యాంకు ఇబ్బంది ఫోన్ చేసి క్రెడిట్ కార్డుపై ఇంస్టా లోన్ రూ.5 లక్షల తీసుకున్నారని కన్ఫం చేశారు. ఇదంతా తనకు తెలియకుండా జరిగిందని చెప్పి, క్రెడిట్ కార్డుకు జమ చేసుకోవాలని కోరాడు. ఇలా డబ్బులు లాగేందుకు ప్రయత్నించిన సైబర్ కేటుగాళ్లకు నాగేశ్వరరావు ఝలక్ ఇచ్చాడు. అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చదవండి: Maruti 5 star rating car: ఫైవ్ స్టార్ సేఫ్టీ.. మారుతీ కారు ప్రత్యేకతలు తెలుసా?
Telangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!
Vizag Crime news: నగ్న వీడియోలు చూపి.. సామూహిక అత్యాచారం
