Vizag Crime : దొంగతనాలు రకరకాలుగా జరుగుతుంటాయి. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో దొంగలు కూడా తెలివిమీరిపోయారు. సీసీ కెమెరాలు ఉన్నా లెక్కచేయడం లేదు. ఈ క్రమంలో ముసుగులు ధరించడం, లేదా కెమెరాలు పగలగొట్టేయడం లాంటి చర్యలకు దిగుతున్నారు. మరింత వైల్డ్ గా ఉండే దొంగలు హత్యలకూ వెనుకాడటం లేదు. తాజాగా ఏపీలో ఓ విచిత్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. విశాఖలో (Vizag Crime) పోలీసులకు చిక్కిన ఆ దిగంబర దొంగ విస్తుపోయే నిజాలు చెప్పాడు.
దొరికితే మతిస్థిమితం లేదని..
విశాఖపట్నంలో ఈ వింత దొంగ బాగోతం వెలుగుచూసింది. దిగంబర దొంగను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. దొంగతనం చేస్తూ దొరికితే మతిస్థిమితం లేని వ్యక్తిగా భావిస్తారని వ్యూహం పన్ని దొంగతనాలు చేస్తూ వచ్చాడు. పూర్తి నగ్నంగా దొంగతనాలు చేసేందుకు అలవాటుపడ్డాడు. ఈ నిందితుడు విజయనగరం జిల్లా కొత్తవలస వాసిగా పోలీసులు గుర్తించారు. ఎంవీపీ ఆరో సెక్టార్ లోని ఓ ఇంటిలో రెండు రోజుల క్రితం ఈ దిగంబర దొంగ చోరీకి పాల్పడ్డాడు. దిగంబర దొంగ పేరు పొట్టి విజయ్ గా పోలీసులు గుర్తించారు.
పొట్టి విజయ్ ఒంటిమీద బట్టల్లేకుండా దొంగతనం చేసిన విషయం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. ఈ దృశ్యాలు చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేపట్టారు. దుస్తులు లేకుండా చోరీలకు పాల్పడడం ఇతని దొంగతనాలలో కొత్తరకం స్టైల్ గా పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి: Kerala Crime news: అమ్మ పెట్టిన బిస్కెట్లే బిడ్డ ప్రాణం తీశాయి!
Cyber Crime: సైబర్ కేటుగాళ్లకు చుక్కలు చూపించాడు.. లక్షలు సేఫ్!
Telangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!
Vizag Crime news: నగ్న వీడియోలు చూపి.. సామూహిక అత్యాచారం
Crime News: కోడలి అక్రమ సంబంధం.. మందలించినందుకు అత్తను..
AP Crime News: తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో హత్యాచారాలు
