HomeCrime NewsTelangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!

Telangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!

Telangana crime news: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో ఈ దోపిడీ వెలుగు చూసింది. దొంగలు బీభత్సానికి పాల్పడ్డారు. దొంగలు బ్యాంకు వెనుక ఉన్న కిటికీని గ్యాస్ కట్టర్ తో తెంచి బ్యాంకులోకి చొరబడ్డారు.

దుండగులు 19 కేజీల బంగారం కొల్లగొట్టుకుని పోయారు. బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. భారీ దొంగతనం కేసులో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ భారీ దోపిడీ వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రం లోని సీబీఐ బ్రాంచ్ లో రీసెంట్ గా సోమవారం నడిరేయి జరిగింది. బ్యాంకులో బంగారం నిల్వ ఉన్న లాకర్లను మాత్రమే పగలగొట్టి లాకర్లలో ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోయారు.

ఎప్పటిలాగే ఉదయం బ్యాంకుకు వచ్చిన అధికారులకు లాకర్లు పగలగొట్టిన సీన్ కనిపించింది. దీంతో బ్యాంకులో భారీ ఎత్తున దోపిడీ జరిగినట్లు భావించి తక్షణమే ఖాకీలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలను తీసుకున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే.. లాకర్లలో భద్రపరచిన 19 కిలోల బంగారం మొత్తం దోపిడీకి గురి కావడంపై ఇంటి దొంగల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.13 కోట్ల విలువైన గోల్డ్ అపహరణకు గురయిందని చెబుతున్నారు.

బ్యాంకులో దొంగతనం జరిగిన విషయం బయటకు తెలియడంతో బ్యాంకులో బంగారాన్ని కుదువపెట్టి లోన్లు తీసుకున్న బాధితులు, లాకార్లలో భద్రపర్చుకున్న కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు, బ్యాంక్ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు.

లాకర్‌లో బంగారం చోరీ విషయం తెలిసి 474 మంది ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బాధితులు బ్యాంక్‌ వచ్చి ఆందోళన చేశారు. బ్యాంకు వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అయితే బ్యాంక్ వెనుక భాగంలో కిటికీని గ్యాస్ కట్టర్ తో తొలగించిన దుండగులు.. లోనికి ప్రవేశించిన వెంటనే సీసీ కెమెరా హార్డ్ డిస్క్ లను పగలగొట్టారు. లాకర్ లను ధ్వంసం చేసి బంగారం దొంగలించారు. సీసీటీవీ డీవీఆర్‌లను కూడా వదలకుండాలేపేశారు.

ఇవీ చదవండి: Vizag Crime news: నగ్న వీడియోలు చూపి.. సామూహిక అత్యాచారం
Telangana crime news: గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. పండుగ వేళ విషాదం
Crime News: కోడలి అక్రమ సంబంధం.. మందలించినందుకు అత్తను..
Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు