Kerala Crime news: చిన్నారులకు పెట్టే తిండి విషయంలో పేరెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలని సమాజంలో జరుగుతున్న ఘటనలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో జరిగిన ఉదంతంతో తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల చిన్నారికి తల్లి పెట్టిన బిస్కెట్లే ప్రాణాలను తీశాయి. ఇంతకీ కేరళలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిస్కెట్లు తింటూ ఊపిరాడక మూడేళ్ల ఏళ్ల చిన్నారి మృతి చెందింది. తిరువళ్లూరు జిల్లా కుమ్మిడిపూండి పక్కన గల కవరప్పెట్టై ప్రాంతంలోని గురువరాజా కందిగై గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన అరికృష్ణన్, అమ్ములు దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి మూడేళ్ల వెంకట లక్ష్మి అనే కుమార్తె ఉంది.
ఆదివారం ఉదయం చిన్నారి వెంకటలక్ష్మికి టీలో బిస్కెట్లు అద్ది తినిపించారు. ఆ సమయంలో చిన్నారి ఒక్కసారిగా ఊపిరి తీసుకోలేక సతమతం అయ్యింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. పాపను సెంగున్రం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వెంకటలక్ష్మిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి చనిపోయిందని తేల్చారు. ఈ ఘటనపై కవార్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరువళ్లువర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చిన్నారులకు వారి వయసును బట్టి సరైన ఆహారం ఇవ్వాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల వయస్సు, ఎదుగుదలను దృష్టిలో ఉంచుకోకుండా ఏవి పడితే అవి పెట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని సూచిస్తున్నారు. ఈ విషయంలో సందేహాలు ఉంటే పిల్లల వైద్య నిపుణుల్ని సంప్రదించాలని, సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారు.
ఇవీ చదవండి: Cyber Crime: సైబర్ కేటుగాళ్లకు చుక్కలు చూపించాడు.. లక్షలు సేఫ్!
Telangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!
Vizag Crime news: నగ్న వీడియోలు చూపి.. సామూహిక అత్యాచారం
Crime News: కోడలి అక్రమ సంబంధం.. మందలించినందుకు అత్తను..
