Vizag Crime news: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. న్యాయ విద్య చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. (Vizag Crime news) నలుగురు నిందితులు ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో తరచూ అత్యాచారాలు, హత్యలు, దాడుల ఘటనలు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో విశాఖలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
విశాఖలో న్యాయ విద్య విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించినట్లు బాధితురాలు వాపోయింది. విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ.. రెండోవ పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన కి సంబంధించి కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో నలుగురికీ అరెస్ట్ చేశామన్నారు. బాధితురాలికి నిందితులలో ఒకరికి పరిచయం ఉందన్నారు. రెండు నెలల నుంచి పరిచయం ఉందని, ఈ కేసు విచారణ జరుగుతోందన్నారు.
ఆగస్టు నెల 13 వ తేదీ నుంచి బాధితురాలిని సదరు నిందితులు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. నగ్న వీడియోచూపి బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. నిందితుల వేదింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. నిందితుల్లో ముగ్గురు లా విద్యార్థులు కాగా, మరొకరు ఓ కంపెనీలో క్యాషిర్ గా పని చేస్తున్నాడని తెలుస్తోంది.
మరోవైపు ఈ దారుణ ఘటనపై ఏపీ హోం శాఖ మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. అత్యాచార ఘటన వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఇవీ చదవండి: Crime News: కోడలి అక్రమ సంబంధం.. మందలించినందుకు అత్తను..
Telangana crime news: గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. పండుగ వేళ విషాదం
Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..
Crime News: టీనేజ్ అమ్మాయి విశృంఖలత్వం.. 19 మందికి ఒకేసారి హెచ్ఐవీ
