Visakha Dairy: విశాఖ డైరీ రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తోందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాడి రైతుల ఆర్థికంగా అభ్యున్నతికి విశాఖ డెయిరీని అప్పటి పెద్దలు స్థాపించారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఇప్పుడది పూర్తిగా వాణిజ్యరంగం వైపు మళ్లిపోయి రైతుల సంక్షేమాన్ని పక్కనబెట్టిందని అయ్యన్న ఆరోపించారు.
డెయిరీ స్వలాభం కోసం ఆవు పాలు లీటరుకు రూ.3 తగ్గించినందుకు రైతులు తీవ్రంగా ఆందోళనకు దిగారని గుర్తు చేశారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 3 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతుందని, రూ.లక్షలు నష్టపోతారన్నారు. ఈ నిర్ణయం రైతులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, అందరూ కలిసి దీని పై స్పందించాలని రైతు సంఘాలను కోరారు.
విశాఖపట్నంలోని విలువైన 7.95 ఎకరాల భూమిని విశాఖ డెయిరీ ఆక్రమించిందని జనసేన నాయకుడు, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని అయ్యన్న గుర్తు చేశారు. దీనిపై కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ, విచారణ చేపట్టి, రైతుల హక్కులను పరిరక్షించాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు విశాఖ డెయిరీపై విచారణ చేపట్టాలన్నారు. ఇది వాస్తవం అయితే వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని పార్టీల నాయకులు కూడా కలిసి రైతుల ఈ సమస్యపై పోరాడవలసిన అవసరం ఉందన్న అయ్యన్న.. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: CBN on Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Vijaya Dairy: విజయ డెయిరీ వివాదం.. త్వరలో మీ బండారం బయటపెడతా
Ramachandra Yadav: వెయ్యి ఆవులు, లక్ష గోవులు ఉచితంగా ఇస్తా.. టీటీడీకి సొంత డెయిరీ ఏర్పాటు చేయండి
Tirumala Laddu: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం
Chittoor Dairy: టీడీపీ మూసేస్తే.. నేడు పునరుద్ధరిస్తున్న జగన్.. అలా ఎలా బాగు చేస్తారంటూ ప్రతిపక్షం గగ్గోలు! (Special Story)
