HomeAndhra PradeshSuper Six: దీపావళి కానుకగా అమల్లోకి ఫ్రీ సిలిండర్ల స్కీమ్

Super Six: దీపావళి కానుకగా అమల్లోకి ఫ్రీ సిలిండర్ల స్కీమ్

Super Six: సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 (Super Six) హామీల్లో భాగంగా ఇచ్చిన సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే స్కీముకు ఖర్చయ్యే నిధుల్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు.

సచివాలయంలోని మొదటి బ్లాక్ లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు సీఎం ఈ సబ్సిడీ మొత్తాన్ని అందజేశారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కును పంపిణీ చేసింది. రూ.2,684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ… మొదటి సిలిండర్‌కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు చేరవేసింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు ఫ్రీగా ఇవ్వనుంది. సంవత్సరానికి 3 విడతల్లో ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చును రిలీజ్ చేస్తుంది.

29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు స్టేట్ గవర్నమెంట్ కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ అవుతుంది. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీ పోను మిగిలిన రూ.876ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

ఈ పథకం అమలుకు ఏటా రూ.2,684 కోట్లు ఖజానాపై భారం పడుతుంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్ధిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్ధిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్ధిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: Free crop Insurance: ఉచిత పంట‌ల బీమాను పున‌రుద్ధ‌రించాలి
Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్లపై బిగ్ అప్ డేట్.. డబ్బులు రిలీజ్
Free Gas Cylinder: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక అప్ డేట్!
AP Free Sand: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ ఆదేశాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ
Free Sand: ఏపీలో ఉచిత ఇసుకపై దుమారం.. టన్ను కేవలం రూ.1,394 మాత్రమే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు