Vijaya Dairy: ఆళ్లగడ్డలో విజయ డెయిరీ వివాదం కొనసాగుతోంది. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఇటీవల విజయ డెయిరీకి (Vijaya Dairy) వెళ్లి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఫొటో లేకపోవడంపై, మాజీ సీఎం జగన్ ఫొటో ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి కొనసాగింపుగా ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అఖిలప్రియ సోదరుడు భూమా జగన్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడారు.
డెయిరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డిపై జగత్ విమర్శలు చేశారు. రాజకీయాలపై స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యకర్తలను వైయస్ఆర్సీపీలోకి తీసుకెళ్లి రోడ్డున పడేశావంటూ జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డెయిరీలో జరుగుతున్న అక్రమాలు తెలుసని వ్యాఖ్యానించారు.
’’త్వరలో ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి బండారం బయటపెడతా. విజయ డెయిరీ ఛైర్మన్ సీటులో కూర్చునే అర్హత జగన్మోహన్ కు ఉందా? స్కామ్ లు జరిగాయని అంటున్నారు? ఎందుకు విచారణ జరపలేదు. వైయస్సార్ సీపీ హయాంలో జరిగిన స్కామ్ లన్నీ బయటపెడుతా.’’ అని అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఆళ్లగడ్డ పరిణామాలపై టీడీపీ అధిష్ఠానం ఆరా తీసింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వివాదంపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇవాళ్టి ఎమ్మెల్యేల భేటీలో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఉండకూడదని ఎమ్మెల్యే అఖిలప్రియ హుకుం జారీ చేశారు. రాత్రి నుంచి ఆళ్లగడ్డ నివాసంలో ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఇద్దరు నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసుల మోహరింపు జరిగింది.
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల భయం..
కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల భయం పట్టుకుంది. యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లోని 6.8 హెక్టార్లలో అధికారులు తవ్వకాలు చేపట్టనున్నారు. కేంద్ర పర్యావరణశాఖ ఆమోదిస్తే తవ్వకాలు మొదలు పెట్టనున్నారు. యురేనియం తవ్వకాలపై కప్పట్రాళ్ల వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: Akhila Priya: మామ కుర్చీలో కూర్చుంటే తప్పేంటి? అఖిల ప్రియ హల్ చల్
Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు
Akhila Priya: చెప్పినట్టుగానే చేస్తున్న అఖిలప్రియ.. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం
Akhila Priya: నాకూ ఓ రెడ్ బుక్.. 100 మంది ఇబ్బంది పడతారు: అఖిల ప్రియ
Gudivada Amarnath: వరదలపై ముందే సమాచారమున్నా ప్రజలను అలర్ట్ చేయలేదు
