HomeAndhra PradeshTTD Chairman: లోకేష్ మార్క్.. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. ఆర్కే పరిస్థితి?

TTD Chairman: లోకేష్ మార్క్.. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. ఆర్కే పరిస్థితి?

TTD Chairman: నాలుగు నెలలుగా నాన్చుతూ వస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్, సభ్యుల పదవులను (TTD Chairman) ఎట్టకేలకు భర్తీ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే, ఇందులో ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ మార్క్ కనిపించిందన్న విశ్లేషణ వస్తోంది.

టీటీడీ బోర్డు చైర్మన్ గా ఓ టీవీ ఛానల్ అధినేత బీఆర్ నాయుడును ప్రభుత్వం ఖరారు చేసింది. మరో టీవీ ఛానల్ అధినేత ఆర్కేను విస్మరించినట్లు స్పష్టమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొంత కాలంగా వీరిద్దరి మధ్య అంతర్గత పోరు నడుస్తోందని చర్చ సాగింది. సోషల్ మీడియాలో ఈ మేరకు మీమ్స్, పోస్టులు కూడా వెలిశాయి.

ఒకరికి ప్రాధాన్యం ఇస్తే మరొకరు నొచ్చుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో పదవులు, పోస్టుల విషయంలో నారా లోకేష్ మార్క్ కనిపించిందంటున్నారు. అయితే, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరోవైపు జనసేన నేత నాగబాబు పేరు కూడా ప్రచారంలో ఉండేది. వీటన్నింటికీ చెక్ పెడుతూ బీఆర్ నాయుడువైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.

వరుసగా ప్రభుత్వ వ్యతిరేక కథనాలు అటు ఆర్కే మీడియాలోనూ, ఇటు మరో ఛానల్ లోనూ తరచూ ఈ మధ్య కాలంలో కనిపించాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెదిరింపులకు లొంగేది లేదన్న సంకేతం లోకేష్ ఇచ్చారంటున్నారు. అందుకే తనకు అన్ని విధాలుగా అనుకూలంగా వ్యవహరించే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారన్న విశ్లేషణలు వస్తున్నాయి. మరి ఆర్కే ఏ రకంగా స్పందిస్తారు? మరో విధంగా ఆర్కేకు నచ్చజెబుతారా? వేచి చూడాల్సిందే.

24 మందితో టీటీడీ బోర్టు ఏర్పాటు చేసినట్లు మీడియాకు సమాచారం అందింది. ఇందులో టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడును ప్రకటించారు.

మిగతా బోర్డు సభ్యులు లిస్టు ఇదీ..

జ్యోతుల నెహ్రూ – జగ్గంపేట ఎమ్మెల్యే
ప్రశాంతి రెడ్డి – కోవూరు ఎమ్మెల్యే
ఎం.ఎస్.రాజు – మడకశిర ఎమ్మెల్యే
పనకబాక లక్ష్మి
నర్సిరెడ్డి
సాంబశివరావు (జాస్తి శివ)
నన్నపనేని సదాశివరావు
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
జంగా కృష్ణమూర్తి
ఆర్.ఎన్.దర్శన్
జస్టిస్ హెల్.ఎల్.దత్
శాంతారామ్
పి.రామ్మూర్తి
తమ్మిశెట్టి జానకిదేవి
బొంగునూరు మహేందర్ రెడ్డి
అనుగోలు రంగశ్రీ
బూరగాపు ఆనందసాయి
సుచిత్రా ఎల్లా
నరేష్ కుమార్
డా.ఆదిత్ దేశాయ్
సౌబర్ హె.బోరా

ఇవీ చదవండి: Ramachandra Yadav: వెయ్యి ఆవులు, లక్ష గోవులు ఉచితంగా ఇస్తా.. టీటీడీకి సొంత డెయిరీ ఏర్పాటు చేయండి
TTD Big News: టీటీడీ కీలక నిర్ణయాలు.. 15 ఏళ్లలోపు చిన్నారులకు నడక దారిలో రిస్ట్రిక్షన్స్‌.. బైక్‌లకు రాత్రిపూట నో ఎంట్రీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు