Periods: ఆడవాళ్లు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మగవాళ్లు ఇలాంటి పనులు చేయరాదట.. అవేంటో తెలుసుకోండి..

Periods: భార్యకు నెలసరి సమయంలో భర్త కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో భర్త భోజనం చేసేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. వాదోపవాదాలు, కొట్లాడటం లాంటివి అసలే చేయరాదని నిపుణులు చెబుతున్నారు. రకరకాల ఎమోషన్స్‌కు గురవడం లాంటివి చేయరాదంటున్నారు. స్త్రీకి నెలసరి వచ్చిన ఐదు రోజులు కాస్త ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మగవారిదేనంటున్నారు. (Periods)

స్త్రీలలో నెలసరి సమస్య అనేది ప్రతి నెలా తప్పని పరిస్థితి. కొందరిలో కాస్త ఆలస్యంగానూ, ముందుగానూ వస్తూ ఉంటాయి పీరియడ్స్‌. ఏ సమస్యా లేని ఆడవారిలో 25 నుంచి 30 రోజుల్లోపు పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తుంటాయి. అయితే, పెళ్లి అయిన స్త్రీలకు పీరియడ్స్‌ వచ్చిన సమయంలో మగవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మగవారు చేసే కొన్ని తప్పుల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు.

Read Also : Weight Gain Tips for Women: అమ్మాయిలూ.. వెయిట్‌ లాస్‌ అవ్వాలంటే ఇలా చేయండి..!

ఈ సమయంలో వంట చేసిన స్త్రీలను నిందించరాదని, ఆ ఆహారం ఎలా ఉన్నా ఆనందంగా స్వీకరించాలని సూచిస్తున్నారు. కూరలో ఆ రోజు కాస్త మరచిపోయి ఉప్పు ఎక్కువ వేసిందనుకుందాం.. లేదా అసలు ఉప్పు వేయడం మరచిపోయిందనుకోండి.. ఈ సమయాల్లో ఎలా పడితే అలా అరవడం, కసురుకోవడం లాంటివి చేయరాదని నిపుణులు మగవారికి సూచిస్తున్నారు. కూరలో రుచి లేకపోయినా, అన్నం సరిగా వండకపోయినా ఆమెతో వాదించి మనశ్శాంతి కరువుయ్యే పరిస్థితులు తెచ్చుకోరాదని సూచిస్తున్నారు.

పెయిన్‌తోనే పనులు చేస్తుంటారు..

పీరియడ్స్‌ వచ్చిన సమయంలో ఆడవారు విపరీతమైన పెయిన్‌తో బాధపడుతుంటారు. ఈ సమయంలో కూరలు గానీ, అన్నం లేదా ఇతర పదార్థాలు చేస్తున్న క్రమంలో కాస్త అటూ ఇటూ అవుతుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వారిపై కోపాన్ని ప్రదర్శించకుండా ఉన్నది తినేసేయాలని సూచిస్తున్నారు. తినేసిన తర్వాత మాటల మధ్యలో ఇలా ఉప్పు ఎక్కువైందని, లేదా అన్నం సరిగా ఉడకలేదని క్యాజువల్‌గా చెబితే వారి మనసు నొచ్చుకోకుండా ఉంటుందంటున్నారు. వీలైనంత వరకు అన్నం తినేటప్పుడు ఆలోచనలు, మాటలు కట్టిపెట్టి భోంచేయాలని సూచిస్తున్నారు.

Read Also : Habits That Women Hate: మగాళ్లలో స్త్రీలకు నచ్చని అలవాట్లు ఏవి? ఓ లుక్కేయండి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles