Habits That Women Hate: మగాళ్లలో స్త్రీలకు నచ్చని అలవాట్లు ఏంటనే విషయాలు ఏంటో చాలా మందికి తెలియదు. ఒక వ్యక్తి సంపూర్ణంగా జీవించాలనే నియమం ఏమీ ఉండదు. ప్రతి వ్యక్తిలో కొన్ని నెగిటివ్ అలవాట్లు, కొన్ని పాజిటివ్ అలవాట్లు ఉంటాయి. ఇవి అవతలి వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఇలాంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా బంధం బలంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. (Habits That Women Hate)
స్త్రీలకు, పురుషులకు (Women and Men) అనేక వ్యక్తిగత అలవాట్లు ఉంటాయి. పెళ్లి కాక ముందు వరకు వీటితో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ పెళ్లయ్యాక తమ భాగస్వామి అలవాట్లతో (Habits) కొందరు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో వాటిని మానుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లికి (Marriage) ముందే లేదంటే ఓ రిలేషన్‌షిప్‌కు (Relationship) ముందుగానే భాగస్వామికి ఏ అలవాట్లు ఇష్టం ఉండదో తెలుసుకొని తదనుగుణంగా జీవన శైలిని (Lifestyle) మార్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు.
ముఖ్యంగా మగవారి విషయంలో మహిళల ఎదుట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. మగువల దృష్టిలో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీలు ఇష్టపడని అలవాట్లు, ఇష్టపడే కొన్ని అలవాట్లు తెలుసుకోవాలి. మహిళలు ఓ సారి ప్లాన్ వేసుకుంటే దాన్ని మార్చడానికి ఇష్టపడరు. ఇలాంటి తరుణంలో వారికి చికాకు కలిగించేలా మళ్లీ మళ్లీ ప్రణాళికలు మార్చకుండా మగవారు జాగ్రత్త వహించాలి.
మంచి ప్రవర్తనతో ముందడుగు వేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చెడు ప్రవర్తన స్త్రీలకు అస్సలు నచ్చదు. ఈక్రమంలో మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా ఆడవాళ్లను ఇంప్రెస్ చేయవచ్చు. రెస్టారెంట్ వెయిటర్, కారు డ్రైవర్ ఇలాంటి వ్యక్తులపై కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ డీసెంట్‌గా బిహేవ్ చేయాలి. ప్రేమను పది మందిలో బహిర్గతం చేయడాన్ని చాలామంది స్త్రీలు ఇష్టపడరు. ఇలాంటి అలవాట్లు మానుకోవాలి. ఎప్పుడూ క్లారిటీగా ఉండాలి. ఆత్మ విశ్వాసంతో ప్రవర్తించాలి. నిర్ణయాలు కాన్ఫిడెంట్‌గా తీసుకోవాలి. పురుషులు స్వతంత్రంగా ఉండటాన్ని మగువలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ఇలాంటి కొన్ని మార్పులు, ప్రవర్తన మార్చుకోవడం వల్ల మహిళలు మిమ్మల్ని ఇష్టపడతారని తెలుసుకోవాలి.
ఒక పురుషుడు అన్ని వేళలా డైలమాలో ఉండి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే, మీ ఈ అలవాటు ఏ స్త్రీ ముందు అయినా మీ బలహీనమైన ఆలోచనను చూపిస్తుంది. మహిళలు త్వరగా నిర్ణయాలు తీసుకునే పురుషులను ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే తన భర్త పెళ్లి అయిన తర్వాత కూడా తల్లిచాటు బిడ్డగా ఉంటే లేదంటే తల్లి ద్వారానే అన్ని పనులు చేయించుకుంటూ ఉంటే అలాంటి ప్రవర్తన యువతకులకు అస్సలు నచ్చదట. ఇలాంటి విషయాలు వారిని కలవరపెడతాయని నిపుణులు సూచిస్తున్నారు. బంధం బలహీనపడేందుకు ఇలాంటి ప్రవర్తన దోహదం చేస్తుందట. అలాగే స్త్రీలు కూడా పురుషుల అహంకార ప్రవర్తనను ఇష్టపడరట. అలాంటి పురుషులకు దూరంగా ఉండేందుకు మహిళలు ఇష్టపడతారని పలు అధ్యయనాల్లో సైతం తేలింది. చాలా అరుదుగా ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడతారట.
ప్రతి మనిషిలోనూ మార్చుకోలేని కొన్ని అలవాట్లు ఉంటాయి. అలాంటి వాటిని మార్చుకోవడానికి ససేమిరా ఇష్టపడరు. ఇలాంటి తరుణంలోనే కాస్త కౌన్సెలింగ్ తీసుకొని వాటిని మార్చుకోవడం వల్ల మంచి జీవన విధానాన్ని గడపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Morning Wake Up: ఉదయాన్నే త్వరగా నిద్ర లేస్తే.. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం..!