Salaar: బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నారు ప్రభాస్. తాజాగా ఆదిపురుష్ మూవీతో తొలిసారి ఆధ్యాత్మిక పాత్రలో నటించారు. శ్రీరామ చంద్రమూర్తిగా నటించిన ప్రభాస్.. ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో తొలిరోజు సుమారు 140 కోట్ల రూపాయలకు పైగా ఆదిపురుష్ మూవీ కలెక్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి ప్రాజెక్టుపై ప్రభాస్ ఫోకస్ పెట్టారు. ఆయన నటిస్తున్న తర్వాతి మూవీ సలార్. కేజీయఫ్ (KGF) సిరీస్‌తో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీతో అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇటు హీరో ప్రభాస్ (Prabhas) బిజీగా గడుపుతున్నారు. (Salaar)
సలార్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అందరూ భావిస్తున్నారు. ఇటీవల సలార్ టీజర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 6వ తేదీన తెల్లవారుజామున 5.12 గంటలకు సలార్ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు సోషల్ మీడియాలో రోజుకో పోస్టుతో అభిమానులు రచ్చ మొదలు పెట్టారు. తాజాగా ఓ సరికొత్త టాపిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్‌ను కేజీయఫ్2తో పోలుస్తున్నారు డార్లింగ్ అభిమానులు. కామన్ పాయింట్లు చెబుతూ హిట్ కొట్టడం పక్కా అని చెబుతున్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ మూవీని కేజీయఫ్2తో ముడిపెట్టారని, అందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. మామూలుగా ఏ సినిమా టీజర్ అయినా, ఫస్ట్ లుక్ అయినా, సింగిల్ అయినా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో విడుదల చేస్తుంటారు. అలాంటిది సలార్ టీజర్ మాత్రం భిన్నమైన శైలిలో తెల్లవారుజామున 5.12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సమయమే ఎందుకు? అనే ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. అందుకు ఓ లాజిక్ పాయింట్ తెరమీదకు వచ్చింది. అదేంటంటే.. కేజీయఫ్2 క్లైమాక్స్‌లో హీరో యశ్‌పై సముద్రంలో అటాక్ జరిగిన సమయం కూడా ఇదే కావడం విశేషం.
ఆ సీన్‌లో యశ్ (Yash) ప్రయాణించే ఓడలో ఇదే సమయాన్ని గడియారంలో చూపుతారు. దీంతో ప్రశాంత్ నీల్ ఈ టైమ్‌లోనే సలార్ మూవీ టీజర్ (Salaar Movie Teaser) రిలీజ్ చేశారు. కేజీయఫ్2లో (KGF2) ఎండింగ్.. సలార్‌లో స్టార్టింగ్.. అన్నట్లుగా ప్రశాంత్ నీల్ టీజర్ రిలీస్ సమయాన్ని ప్రకటించారని చెబుతున్నారు. మరోవైపు కేజీయఫ్2లో హీరో యశ్ లుక్ కూడా చాలా రఫ్‌గా ఉంటుంది. ఊరమాస్ గెటప్ కనిపిస్తుంది. ఇదే సలార్ మూవీలో ప్రభాస్‌ను కూడా అదే రకంగా చూపించడం గమనార్హం. ఇక కేజీయఫ్ సినిమా బంగారు గనుల మైనింగ్ నేపథ్యంలో చూపించగా, సలార్ మూవీలో కోల్ మైనింగ్ కథగా సాగుతుందట. దీంతో ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తున్నారు అభిమానులు. సలార్ పోస్టర్‌లో ప్రభాస్ ఊరమాస్ గెటప్‌లో కనిపించారు. ఈ రెండు సినిమాల మధ్య కామన్ పాయింట్లను అభిమానులు వెలికితీస్తున్నారు.
సలార్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మాస్ కమ్ బ్యాక్, బంపర్ హిట్ కొట్టాలని సగటు ప్రభాస్ అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. ఇక సలార్ మూవీలో ఇతర నటీనటులు ఎవరనే దానిపై కూడా ఆసక్తికరంగా మారింది. అంచనాలు పెరగడానికి ఇది కూడా ఓ కారణం అవుతోంది.ప్రభాస్ సరసన సలార్ మూవీలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో 5 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.