Salaar Teaser: డార్లింగ్ ప్రభాస్ నటిస్తన్న సలార్ టీజర్ ఈ తెల్లవారుజామున విడుదలైంది. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న టీజర్ రావడంతో పండగ చేసుకుంటున్నారు. ముందే ఊహించినట్లుగానే ప్రభాస్ (Prabhas) ఇందులో ఊరమాస్ లుక్కులో దర్శనమిచ్చారు. కథానాయకుడిని పూర్తిగా చూపించలేదు. అయితే, ఎలివేషన్లు మాత్రం ఇందులో హైలెట్ అయ్యాయి. ఓవైపు ఎలివేషన్లు, మరోవైపు బ్యాక్ డ్రాప్‌లో హీరో ఫైటింగ్ సీన్లు మిళితం చేశారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమాత్రం తీసిపోలేదు. (Salaar Teaser)
అభిమానులు కోరుకున్నట్లుగానే ప్రభాస్ మాస్ లుక్కులో కనిపిస్తారు. గురువారం తెల్లవారుజామున ఈ చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేశారు. “సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ…. జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే ఆ పార్కులో…. అంటూ హీరో ప్రభాస్‌కు ఎలివేషన్లు ఇచ్చారు. ఇందులో టీనూ ఆనంద్ ఎలివేషన్ డైలాగ్స్‌తో మొదలవుతుంది. ఈ టీజర్‌ను చూస్తుంటే డార్లింగ్ మూవీ నుంచి అభిమానులు కోరుకున్నట్లుగానే మాస్ ఎలిమెంట్స్ దండిగా ఉంటాయనిపించేలా అన్ని టాపిక్స్‌నూ మేళవించి మూవీని దర్శకుడు (Prashanth Neel) రంగరిస్తున్నారని తేలుతోంది.
ఇప్పటికే సలార్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండటం విశేషం. సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ పోషిస్తున్నారు. కథానాయికగా శృతిహాసన్ నటిస్తోంది. జగపతిబాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి.
Read Also : Salaar: తెల్లవారుజామున 5.12 గంటలకే ఎందుకు? కేజీయఫ్2తో లింక్? ‘సలార్’పై ఆసక్తికర చర్చ