Milk: నిత్యజీవితంలో పాలు భాగమైపోయాయి. డైలీ పాలతో కాఫీ, టీలతో పాటు వేడి చేసుకుని పాలు కూడా చాలా మంది తాగుతారు. పాలు (Milk) ఆరోగ్యానికి మంచి ఆహారం అని చాలా మంది చెబుతారు. పాలలో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇది ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. ఇంతకీ పచ్చిపాలు తాగడం అనేది ఆరోగ్యానికి మంచిదా?
పాలు తాగడం వల్ల హృదయ స్పందన మెరుగవుతుంది. రక్తంలో గడ్డకట్టడాన్ని అరికడుతోంది. కండరాలు, నరాల పనితీరులో కూడా పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పచ్చిపాలతో చాలా రకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. పచ్చి పాలు తాగడం వెనుక వాదన ఉంది. పచ్చి పాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయంటారు. అలర్జీలు, ఉబ్బసం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని, అదే సమయంలో లాక్టోస్ అసహనం ఉన్నవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెబుతారు.
హానికరమైన బ్యాక్టీరియా
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, డైటీషియన్ డాక్టర్ ఎరిన్ రోసీ కీలక వివరాలు చెబుతున్నారు. మీరు నేరుగా ఆవు లేదా గేదె పచ్చి పాలను తాగితే అందులో అనేక రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందంటున్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యానికి గురయ్యే చాన్స్ లేకపోలేదు.అయితే ఇది అందరికీ జరగదు. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియాను తట్టుకునే శక్తి కలిగి ఉంటారు.
తేలికపాటి వాంతులు, విరేచనాల తర్వాత కొందరు కోలుకుంటారు. కానీ కొంతమందికి ఇబ్బందిగా మారుతుంది. సాల్మోనెల్లా బ్యాక్టీరియా, లీషేరియా మోనోసైటోజెన్‌లు వంటి బ్యాక్టీరియా పచ్చి పాలలో ఉంటాయి. ఇవి కడుపులో హాని కలిగిస్తాయి. ఇవి తక్షణ ప్రభావం చూపకపోతే, రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతుంది. విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, వాంతులు లాంటి సమస్యలు చుట్టుముడతాయి. ఈ హానికరమైన బ్యాక్టీరియా పచ్చి పాలతో కడుపులోకి వెళ్తే, ఆరోగ్యవంతమైన పెద్దలకు తేడా ఉండదు. కానీ ఇది పిల్లలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
అపోహ ఏమిటి?
పాలను మరిగించడం వల్ల దానిలోని పోషకాలు నశిస్తాయని కొందరు చెబుతారు. అయితే ఇది పోషక మూలకాలకు ఎటువంటి నష్టం కలిగించదన్నది శాస్త్రీయంగా వాస్తవం. పాలను 20 సెకన్ల పాటు 80 డిగ్రీల వరకు వేడి చేస్తే, హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది. దాని వల్ల ఎటువంటి హాని జరగదు. పాశ్చరైజ్డ్ పాలు అలానే విక్రయిస్తారు. 80 డిగ్రీలకు వేడి చేసి, 20 సెకన్లలో సున్నా డిగ్రీలకు తీసుకురావడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా దానిలో పెరగదు. పాలు మారతాయి. పచ్చిపాలను తీసుకునే ముందు నిపుణుల సూచనలు, వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.
ఇవీ చదవండి: Donkey milk: శిశువులకు గాడిదపాలు పట్టడం వల్ల ఉపయోగాలు తెలుసా?
Millet Milk: చిరుధాన్యాలతోనూ మిల్లెట్ మిల్క్.. ఇలా తయారు చేసుకోండి!
Cow milk: బరువు తగ్గాలా? ఆవు పాలు మంచిదా? గేదె పాలు మంచిదా?
Milk and dates benefits: రక్త హీనతతో బాధపడుతున్నారా? పాలలో ఇవి నానబెట్టి తింటే వేగంగా ఉపశమనం
Milk and honey : పాలలో ఇది కలిపి తాగితే జబ్బులు దరిచేరవు.. తప్పక ప్రయత్నించండి
