Complaint: ఓ సమస్యతో పోలీసు స్టేషన్ కు వెళ్లిన బాధితులపై పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఇటువంటి సందర్భాల్లో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. ఓ వైపు తమ సమస్య, మరోవైపు పోలీసులు పట్టించుకోక పోవడం (complaint) అనేది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? అనే విషయాల్లో న్యాయవాదులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి చేతిలో బాధకు గురైనా, వేధింపులకు గురైనా, ఏరకమైన ఇబ్బందులకు గురైనా.. అలాంటి వ్యక్తి పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి సందర్భంలో పోలీసులు పట్టించుకోకపోతే ఏం చేయాలన్నది చాలా మందికి అనుమానం తలెత్తే ప్రశ్న.
నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లినా, కంప్లయింట్ చేసినా, కేసు రిజిస్టర్ చేయలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చాలా మంది చెబుతుంటారు. అఫెన్స్ జరిగినా కూడాపోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
మొదట పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చినప్పుడు అక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ (రసీదు) తీసుకునే బాధ్యత మీపై ఉంటుంది. తీసుకోవాలి. అయినా పోలీసులు పట్టించుకోకపోతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలి. అక్కడ కూడా మీకు న్యాయం జరగక ఎస్పీ వారు కూడా మీ సమస్యను పట్టించుకోక పోతే మీకు ఉన్న ఆప్షన్ మరోటి ఉంది.
డైరెక్టుగా మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లి ఓ ప్రయివేటు కంప్లయింట్ అడ్వొకేట్ ద్వారా ఫైల్ చేసుకోవాలి. న్యాయస్థానం దీనిపై విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇస్తుంది. దీంతో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని న్యాయవాదులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Badvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Chief Justice of India: తన ఇంట్లో గణేష్ పూజ.. మోదీ పాల్గొనడంపై సీజేఐ ఏమన్నారంటే..
Women: ఏపీలో మహిళలు, చిన్నారులపై దాడులు.. ఎన్‌డబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం!
Tirupati: మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం అత్యంత పాశవికం
